విశ్వక్.. ‘పాగల్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమధ్య హుషారుతో హిట్టందుకున్న లక్కీ మీడియా బ్యానర్‌మీద మరో క్రేజీ లవ్ స్టోరీ తెరకెక్కబోతోంది. రీసెంట్‌గా ఫలక్‌నుమాదాస్ చిత్రంతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విశ్వక్‌సేన్‌తో కలిసి ‘పాగల్’ చిత్రాన్ని నిర్మించేందుకు నిర్మాత బెక్కం వేణుగోపాల్ రంగం సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుతో నరేష్‌రెడ్డి కుప్పిలిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. క్రేజీ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ ద్వితీయార్థం నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ -్ఫలక్‌నుమాదాస్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విశ్వక్‌సేన్‌తో ప్రాజెక్టు చేయడం హ్యాపీగా ఉంది. ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో వచ్చిన నరేష్‌రెడ్డిని దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ‘పాగల్’ మూవీ బెస్ట్ క్రేజీ లవ్ స్టోరీ అవుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.