ఆకట్టుకునే కౌసల్య..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్ రాజు, వెనె్నల కిషోర్ ముఖ్యపాత్రల్లో దర్శకుడు భీమనేని శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రం -కౌసల్యా కృష్ణమూర్తి. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కెఎస్ రామారావు సమర్పణలో కెఎ వల్లభ నిర్మించారు. ప్రత్యేక పాత్రలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించాడు. సెన్సార్ నుంచి యు సర్ట్ఫికెట్ పొందిన సినిమా 23న థియేటర్లకు వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో సమర్పకుడు కెఎస్ రామారావు మాట్లాడుతూ -స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న సినిమాలో తొలిసారి తెలుగమ్మాయి ఐశ్వర్యారాజేష్ ‘కౌసల్య’ పాత్ర పోషిస్తోంది. ఇది ఆమెకు తొలి తెలుగు సినిమా కూడా. మంచి కానె్సప్ట్‌తో తెరకెక్కిన సినిమాను 23న విడుదల చేస్తున్నాం అన్నారు. నిర్మాత కెఎ వల్లభ మాట్లాడుతూ -క్రికెట్ నేపథ్యంగా తెరకెక్కిన సినిమా అందరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. దర్శకుడు భీమనేని మాట్లాడుతూ -టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉండటం చూస్తుంటే ఆడియెన్స్‌కి పాజిటివ్ బజ్ ఉందని తెలుస్తోంది. సినిమా ఔట్‌పుట్ బాగా వచ్చింది. రీమేక్ అయినా, స్ట్రెయిట్ సినిమాకంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాం. సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా అన్నారు.