అలా కుదిరింది జోడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటినుంచో ఓ రియలిస్టిక్ అప్రోచ్ మూవీ చేయాలని అనుకుంటున్న తరుణంలో దర్శకుడు విశ్వనాథ్ చెప్పిన కథకు కనెక్టయ్యాను. అదే -జోడీ అంటున్నాడు హీరో ఆది. వైవిధ్యమన కథ కథనాలతో తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ -జోడి. ఆది, శ్రద్ధా శ్రీనాథ్ హీరోహీరోయిన్లు. సెప్టెంబర్ 6న సినిమా థియేటర్లకు వస్తోన్న తరుణంలో చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. హీరో ఆది మాట్లాడుతూ కథ విన్నప్పుడు కలిగిన ఫీల్ స్క్రీన్‌మీద మరింతగా పెరిగింది. శ్రద్ధ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. టీజర్ చూసిన వాళ్లంతా కొత్తగా ఉన్నానంటూ చెప్తుంటే హ్యాపీ అనిపిస్తోంది. నరేష్, వెనె్నల కిషోర్‌లాంటి వండర్‌ఫుల్ ఆర్టిస్టులతో పని చేసిన ఫీలింగ్ బావుంది. ప్రొడ్యూసర్ విజయలక్ష్మి సినిమా మీద చాలా ఎఫర్ట్ పెట్టారు. అనుకూల వాతావరణంలో వస్తోన్న సినిమా ఆడియన్స్‌ని పూర్తిగా ఎంటర్‌టైన్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నాడు. నిర్మాత విజయలక్ష్మి మాట్లాడుతూ -నాచురల్ సినిమా చేద్దామన్న ఆలోచనలో ఉన్నపుడు దర్శకుడు విశ్వ ఈ కథ చెప్పాడు. ఆది అయితే బావుంటుందన్న ఆలోచనతో కథ నేరెట్ చేసినపుడు ఓకే చెప్పాడు. శ్రద్ధ ఇప్పటికే ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకుంది. డైలాగ్స్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నాం. ఫణి మ్యూజిక్, విశ్వ ఫ్యాషన్.. వెరసి మంచి వాతావరణంలో తయారైన సినిమా జోడి. మా టీం ప్రయత్నానికి ఆడియన్స్ ఆదరణ ఉంటుందని నమ్ముతున్నా అన్నారు. దర్శకుడు విశ్వనాథ్ అరిగెల మాట్లాడుతూ -ముగ్గురి నమ్మకంతో ముందుకు కదిలి విడుదల వరకూ వచ్చిన సినిమా జోడి. నిర్మాత విజయలక్ష్మి, హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్, హీరో ఆది.. ముగ్గురి సపోర్ట్‌తోనే సినిమా ఇంతవరకూ వచ్చింది. ఆర్టిస్టులే కాదు, సినిమా కోసం నాతో జర్నీ చేసిన ప్రతి టెక్నీషియన్‌కీ థ్యాంక్స్ చెబుతున్నా. ఓ మంచి సినిమా చేశాం. మీ నమ్మకాన్ని వమ్ముచేయదు అన్నాడు. హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ -జెర్సీనుంచి ప్రేక్షకులు అందిస్తోన్న ప్రేమను ఎప్పటికీ మర్చిపోను. కథ వింటున్నపుడే నవ్వొచ్చింది. దర్శకుడు విశ్వ అంత బాగా డిజైన్ చేశాడు. రెగ్యులర్ హీరోయిన్ ఇమేజ్‌తో నా పాత్ర ఉంటుంది. ఆది మంచి సపోర్టింగ్ కోస్టార్. ఈ సినిమా నాకు మంచి మెమరీ. డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా అందరికీ ఈ సినిమా మంచి పేరు తెస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.