పరారె.. ఓ వెరైటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యోగేశ్వర్, అతిథిని హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దర్శకుడు సాయి శివాజీ తెరకెక్కిస్తోన్న చిత్రం -పరారి. రన్ ఫర్ ఫన్ అనేది ఉప శీర్షిక. శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై ప్రత్యూష సమర్పణలో జీవీవీ గిరి నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఓ పబ్‌లో యోగేశ్వర్, ముంబయి డ్యాన్సర్ మినాల్‌పై ‘గరమ్ గరమ్ మురిగి మసాల’ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించటంతో షూటింగ్ పూరె్తైంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిశివాజీ మాట్లాడుతూ -పూర్తిస్థాయి యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో కుటుంబ నేపధ్యం కలుపుకుని వినోదాత్మకంగా తెరకెక్కించిన చిత్రమిది. హైదరాబాద్, బ్యాకాంక్‌లో చిత్రీకరణ జరిపాం. హీరోగా పరిచయమవుతోన్న యోగేశ్వర్‌కు మంచి భవిష్యత్ ఉంది. సహకరించిన టీంకు నా ధ్యన్యవాదాలు అన్నాడు. నిర్మాత గిరి మాట్లాడుతూ -సుమాన్ కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తే, ఆలీ ఓ మంచి పాత్ర చేశారు. సస్పెన్స్, థ్రిల్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన పరారి చిత్రాన్ని ఆడియన్స్ ఆదరించాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు శివాజీ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని హీరో యోగేశ్వర్ అన్నాడు.