ఇదే నా బెస్ట్ లవ్‌స్టోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణరంగం చిత్రంలో కల్యాణితో నడిచిన లవ్‌స్టోరీయే ఇప్పటివరకూ నేను చేసిన ది బెస్ట్ లవ్‌స్టోరీ అన్నాడు హీరో శర్వానంద్. ఇద్దరిమధ్య మంచి కెమిస్ట్రీ వర్కవుటైందన్న అప్లాజ్ వచ్చిందన్నాడు. శర్వా హీరోగా సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘రణరంగం’ గురువారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో, శుక్రవారం ఉదయం చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. హీరో శర్వానంద్ మాట్లాడుతూ -నాపై నిర్మాతలకున్న నమ్మకానికి రుణపడివుంటా. ఆడియన్స్‌ని స్క్రీన్‌ప్లే బేస్డ్ యాక్షన్ కంటెంట్‌తో ఎంటర్‌టైన్ చేయాలన్న ఉద్దేశంతో తీసిన రణరంగానికి మంచి ఓపెనింగ్స్ రావడం హ్యాపీగా ఉంది. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్‌కు వస్తోన్న ప్రశంసలు మర్చిపోలేనివి. సినిమాకు క్రమంగా ఆడియన్స్ కనెక్టవుతున్నారు. ఇందులో నేను చేసిన మాస్ క్యారెక్టర్‌తో నాకు నేనే నచ్చినట్టు అనిపిస్తోంది అన్నాడు. చిత్ర సమర్పకుడు పిడివి ప్రసాద్ మాట్లాడుతూ -తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 7.5 కోట్ల గ్రాస్, రూ.4.45 కోట్ల షేర్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్‌గా శర్వా పెర్ఫార్మెన్స్ అమేజింగ్ అన్నారు. సినిమాటోగ్రాఫర్ దివాకర్ మణి మాట్లాడుతూ -విజువల్స్ క్వాలిటీని మెచ్చుకుంటుంటే హ్యాపీగా ఉందన్నారు. దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ -ఇది శర్వా సినిమా అని ముందే చెప్పా. దర్శకుడిగా ఏ సినిమాకూ రానన్ని ఫోన్లు వస్తున్నాయి. నిర్మాతలు రిచ్‌గా సినిమా తీశారు. ఓపెనింగ్స్ ట్రెండ్ కొనసాగితే నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది అన్నారు.