ఉత్సాహంగా వరల్డ్ ఫొటోగ్రఫీ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ ఫొటోగ్రఫీ 181వ దినోత్సవాన్ని హైదరాబాద్‌లో తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఉత్సాహంగా జరుపుకుంది. అసోసియేషన్ అధ్యక్షుడు జి శ్రీను, ప్రధాన కార్యదర్శి కె శ్రీను, ఉపాధ్యక్షుడు సుబ్బారావు, కోశాధికారి వీరభద్రమ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి నటుడు రాజేంద్రప్రసాద్, హీరో అల్లరి నరేష్, దర్శకులు వైవీఎస్ చౌదరి, రసూల్ ఎల్లోర్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో సీనియర్ ఫొటోగ్రాఫర్లు శ్యామల్‌రావు, శ్యామ్‌ను సత్కరించారు. సభ్యులందరికీ జ్ఞాపికలు బహూకరించారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘కెరీర్‌లో మూడుతరాల ఫొటోగ్రాఫర్లతో అనుబంధం నాది. ఒకప్పుడు ఫొటోలతోనే పబ్లిసిటీ నడిచింది. కార్యక్రమానికి నన్ను ఆహ్వానించటం ఆనందంగా ఉంది. బిఎన్ రెడ్డి, యన్టీఆర్‌లాంటి ఎంతోమంది లెజెండ్స్‌తో నాకున్న పరిచయ జ్ఞాపకాలను పదిలం చేసింది స్టిల్ ఫొటోగ్రాఫర్లే. వాటిని చూసుకుని మురిసిపోతుంటాను. స్టిల్ ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్‌కు నా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అన్నారు. దర్శకుడు వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ -యన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి.. ఇలాంటి లెజెండ్స్ ఫొటోగ్రాఫర్లు తీసిన అందమైన స్టిల్స్‌తో వెలుగులోకి వచ్చినోళ్లే. స్టిల్ ఫొటోగ్రాఫర్లు లొకేషన్‌లో ఫొటోలు తీయడానికే పరిమితం కాదు. దర్శకుడి ఊహకు అనుగుణంగా ఆర్ట్ డైరెక్టర్లకూ హెల్ప్ చేస్తుంటారు. ఏ సినిమానైనా సొంత సినిమాగా భావించే తత్వం వాళ్లది అన్నారు. సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ -సభ్యులంతా నాకు సోదరులులాంటి వాళ్లు. కార్యక్రమానికి నన్ను పిలవడం అమిత గౌరవంగా భావిస్తున్నా. చరిత్ర రాయడానికి ఫొటోగ్రఫీయే ముఖ్య ఆధారం అన్నారు. సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్లతో తమకున్న అనుబంధాన్ని దర్శకుడు వివి వినాయక్, హీరో అల్లరి నరేష్ గుర్తు చేసుకున్నారు.