హీరోగా బెల్లంకొండ గణేశ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు సాయిగణేశ్ టాలీవుడ్‌కు పరిచయం కానున్నాడంటూ కొంతకాలంగా వార్తలొస్తుండటం తెలిసిందే. దీనికి అప్‌డేట్‌గా -పవన్ సాధినేని తెరకెక్కించనున్న సినిమాలో సాయిగణేశ్ నటించనున్నట్టు తెలుస్తోంది. ప్రేమకథగా రూపొందనున్న చిత్రానికి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదట. దసరా ముహూర్తంగా సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. హుషారు సినిమాతో సక్సెస్ అందుకున్న నిర్మాత బెక్కం వేణుగోపాల్‌తో కలిసి బెల్లంకొండ సురేశ్ ఈ సినిమాను నిర్మించొచ్చని సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు మంచి సక్సెస్ అందుకోవడంతో -తండ్రిగా నిర్మాత సురేష్ మహదానందాన్ని వ్యక్తం చేశారు. ఈ టైంలోనే సాయిగణేశ్‌ను సైతం ట్రాక్ మీదకు తెచ్చేందుకు సరేష్ ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు.