ఎమోషనల్ థ్రిల్లర్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమోషనల్ థ్రిల్లర్ కథతో రాజశేఖర్ కొత్త ప్రాజెక్టుకు సిద్ధమయ్యారు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అధినేత జి ధనుంజయన్ నిర్మించనున్న చిత్రాన్ని, బేతాళుడు ఫేమ్ ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తాడు. సింగిల్ లైన్ స్టోరీ విన్న వెంటనే రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తారని నిర్మాత ధనుంజయన్ చెప్పారు. ఇటీవల విడుదలైన కిల్లర్ చిత్రానికి సంగీతం సమకూర్చిన సైమన్ కె కింగ్ సంగీత దర్శకత్వం వహించనున్నారు. సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలోనే షూటింగ్ మొదలుపెడతామని, హీరోయిన్‌తోపాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. తమిళంలో ఎన్నో చిత్రాలు అందించిన నిర్మాత ధనుంజయన్, ఈ ప్రాజెక్టుతో తెలుగులోకి అడుగుపెడుతున్నారు.