పిలుపులేదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం తిరిగినంత వేగంగా పనితనం పెరగదు. పనితనానికి గుర్తింపు -కాలమే ఇవ్వాలి. ఈ రెండింటి మధ్యన ఉండే చిన్న కన్ఫ్యూజన్ లైన్‌మీద -కొత్త ఫ్రేమ్ పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాడు దర్శకుడు వెంకట్ రాంజీ. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో సక్సెస్‌కు సరికొత్త నిర్వచనమిచ్చిన దర్శకుడి నుంచి వచ్చిన తాజా చిత్రం -ఎవరు? స్క్రిప్ట్ మొదలెట్టిన దగ్గర్నుంచీ సినిమా ముగించే వరకూ -అతని స్కీమంతా పెర్ఫెక్ట్. అందుకే క్షణం తరువాత అలాంటి మాడ్యూల్‌ని ప్రయోగించిన దర్శకుడిగా పేరొచ్చింది. స్క్రీన్‌ప్లే స్టయిల్, ఆర్టిస్టుల నుంచి కావాల్సింది రాబట్టిన విధానం, బిగింపుతో కథను నెరేట్ చేసిన స్టయిల్.. అన్నింటికీ అటు ఆడియన్స్ నుంచి, ఇటు క్రిటిక్స్ నుంచీ ప్లస్ మార్కులేపడ్డాయి. కెరీర్‌ని ముందుకు తీసుకెళ్లే కొత్త ప్రాజెక్టు మాత్రం కనెక్టవ్వలేదట. ‘ఎవరు చిత్రాన్ని ఎక్కువమంది పొగడటమే తప్ప, ఇదిగో చాన్స్ అంటూ ఏ నిర్మాతనుంచీ ఒక్క ఫోనూ రాలేదన్నది’ రాంజీ చెప్పకనే చెప్పిన మాట. నా మొబైల్ నెంబర్ ఇంకా ఎవరికీ తెలీకేమో అంటూ సరిపెట్టుకున్నా, కష్టానికి తగిన కెరీర్ ఫలం అందలేదన్న ఆవేదన అయితే మాటల్లో వినిపిస్తోంది. థ్రిల్లర్లను అమితంగా ఇష్టపడతానని, తనదగ్గర మరో థ్రిల్లర్ సిద్ధంగా ఉందని ప్రకటించుకున్నా -రాంజీకి ఏ నిర్మాత నుంచీ పిలుపు మాత్రం రావడం లేదు. కథలో సస్పెన్స్‌ను బలంగా రాసుకున్న కుర్ర దర్శకుడు -కెరీర్ కన్ఫ్యూజన్‌ను అర్థం చేసుకోలేకపోతున్నాడేమో. గత నాలుగైదేళ్లలో టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో పెద్ద హిట్లుకొట్టిన చాలామంది దర్శకులు ఎదుర్కొన్న పరిస్థితే ఇది కూడా. సో, టాలెంట్ కూడా టైం ఫ్రేమ్‌లో భాగమే కనుక -కొత్త ఫ్రేమ్ పెట్టే టైం కోసం రాంజీ ఎదురు చూడక తప్పదు.