మనసుకునచ్చినట్టే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రణరంగం కొత్త కథలా అనిపించకపోవచ్చు. కానీ, దీని స్క్రీన్ ప్లే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. అందుకే ఆ సినిమా చేశా. ప్రయోగం ఫలితాన్నిచ్చిందన్న సంతృప్తితో వున్నా. రిలీజ్ రోజు టాక్‌కీ ఇప్పుడొస్తున్న కలెక్షన్లకూ అసలు సంబంధమే లేదు. సినిమాపై టాక్ మరోలా మొదలైనా.. సంతృప్తికరమైన వసూళ్లతో ఐయామ్ హ్యాపీ

ఏదోక ఇమేజ్ చట్రంలో బంధీకావడం నాకు అస్సలు నచ్చని విషయం. సినిమా హిట్టు ఫ్లాపులన్నవి మన చేతుల్లో ఉండదు. కాని -శర్వానంద్ సినిమా చేస్తున్నాడంటో ఏదోక వైవిథ్యం ఉంటుందన్న నమ్మకం మాత్రం ఆడియన్స్‌లో ఉంటుంది. అందుకోసం ఎలాంటి సిట్యుయేషన్ ఎదుర్కోడానికైనా ఎప్పుడూ సిద్ధంగా ఉంటా’ అంటున్నాడు హీరో శర్వానంద్. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కించిన ‘రణరంగం’ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమా టాక్‌కు భిన్నంగా థియేటర్ల వద్ద మంచి కలెక్షన్లు రాబడుతున్న సమయంలో -శర్వా తన మనసు భావనను మీడియాతో పంచుకున్నాడు. ‘ప్రస్థానం నుంచీ నా కథల ఎంపిక బావుంటోందని అంతా అంటున్న మాటే. అందుకే ఓకే జోనర్ కథలకు దూరంగా ఉండేందుకే ఎక్కువ ప్రయత్నిస్తున్నా. వైవిథ్యమైన కథా కథనాలనే ఎంచుకుంటున్నా. ‘విడుదల రోజునుంచీ సినిమా బాగలేదని అన్నవాళ్లు లేరు. కాకపోతే, అబౌ యావరేజ్ అన్న స్టేజ్‌దగ్గర సినిమాను నిలబెట్టారు. ఊహించిన ఫలితం దక్కలేదని అందుకే అంటున్నా. సమీక్షలు కనికరించివుంటే సినిమా టాక్ మరోలా ఉండేదే. ఇప్పుడు పరిస్థితి వేరు. క్రమంగా కలెక్షన్లు పెరిగాయి. మరింత ముందుకెళ్తుందనే అనుకుంటున్నా’ అన్నాడు. ముందు రవితేజ కోసం సిద్ధం చేసిన కథేనని, వైవిథ్యమైన స్క్రీన్‌ప్లే, ఇలాంటి గ్యాంగ్‌స్టర్ పాత్రను ఎప్పుడూ చేసి ఉండకపోవడంతో.. కొత్తగా చేద్దామన్న ఆలోచనతోనే ప్రాజెక్టుకు సిద్ధమయ్యానన్నాడు. ‘డిఫరెంట్ సినిమా చేశానన్న సంతృప్తి ఉంది. నా వెల్‌విషర్లు సైతం ఈ విషయంలో నన్ను భుజంతట్టారు. అనుకున్న దానికంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఎక్కువే వచ్చాయి’ అన్నాడు. ‘కథల ఎంపిక విషయంలో ప్రమాణాలు పాటించాలన్న నియామాలేం పెట్టుకోదలచుకోలేదు. కొత్తగా ఉందా లేదా? వైవిధ్యమైన సినిమా చేస్తున్నానన్న భావన మనసుకు కలిగిందా లేదా అన్నదే చూస్తా’ అంటున్నాడు శర్వా. రీమేక్ ‘96’, ‘శ్రీకారం’ చిత్రాలతో బిజీగావున్న శర్వానుంచి వైవిధ్యమైన సినిమాలే వస్తాయని ఆశిద్దాం.