సంక్రాంతి రేసులో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి సినిమాల రేసులోకి కళ్యాణ్‌రామ్ కూడా చేరాడు. ఈమధ్యే 118 సినిమాతో హిట్టందుకున్న కళ్యాణ్ చేస్తున్న తాజా చిత్రం -ఎంత మంచివాడవురా. మెహరీన్ కథానాయిక. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్‌గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తోన్న చిత్రమిది. శతమానం భవతి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సతీశ్ వేగెశ్న తెరకెక్కిస్తున్నాడు. సెకెండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్న చిత్రానికి సంబంధించి నిర్మాత ఉమేష్‌గుప్త వివరాలందిస్తూ -ఎంత మంచివాడవురా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్‌తో అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ సాగిస్తున్నాం. గోపీసుందర్ అద్భుతమైన స్వరాలు అందిస్తున్నారు. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 22 వరకూ తణుకు, రాజమండ్రి పరసరాల్లో రెండో షెడ్యూల్ పూర్తి చేస్తాం.
రెండు యాక్షన్ ఎపిసోడ్స్‌తోపాటు కీలక సన్నివేశాలు చిత్రీకరణ అక్కడ జరుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే పండుగ సినిమాగా సంక్రాంతికి విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. దర్శకుడు సతీశ్ వేగెశ్న మాట్లాడుతూ -మంచి కథ. మంచి హీరో. మంచి టీం. మంచి ఫీల్‌తో సినిమా రూపొందుతోంది. టైటిల్‌ని బట్టి హీరో క్యారెక్టరైజేషన్ అర్థం చేసుకోవచ్చు అన్నారు.