రెండో’ మాట లేదు.. ఈసారి చేసి చూపిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహోనుంచి మరో అట్రాక్షన్ బయటికొచ్చింది. తాజాగా ‘బ్యాడ్ బాయ్’ పాటను విడుదల చేశారు. ప్రభాస్, జాక్విలిన్ ఫెర్నాండెజ్‌పై చిత్రీకరించిన పాట యూత్‌కి బాగా కనెక్టయ్యేలా ఉంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది.

భారీస్థాయిలో నిర్మించిన సాహో కారణంగా ఏడాదికి రెండు సినిమాలు చేస్తానన్న మాట సాథ్యం కాలేదు. ఈసారి మాటివ్వకుండానే చేసి చూపిస్తా -అన్నాడు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రభాస్, శ్రద్ధాకఫూర్ జోడీగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన చిత్రం సాహో. ప్రమోద్, వంశీ, విక్కీ నిర్మాతలు. ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రభాస్ మాట్లాడుతూ మాస్ పల్స్ తెలిసిన సుజీతే -డైహార్డ్ ఫ్యాన్స్ పదం సృష్టికర్త. అతను చెప్పిన కథ నిర్మాతలకు నచ్చటంతో నాకు నెరేట్ చేయడానికి పంపించారు. అలా నిక్కరేసుకుని వచ్చిన సుజీత్‌ది, 22 ఏళ్ల వయసులో ‘రన్ రాజా రన్’ సినిమా చేసిన అనుభవమంతే. కథను మాత్రం అనుభవజ్ఞుడిలా చెప్పాడు. షూట్ మొదలైనప్పుడు -దిగ్గజ సాంకేతిక నిపుణులను ఎలా హ్యాండిల్ చేస్తాడా అన్న సంశయం కలిగింది. ఒక్కరోజు కూడా కోపం, టెన్షన్ లేకుండా టీంని అతను హ్యాండిల్ చేసిన స్టయిల్ చూస్తే, అంతర్జాతీయ దర్శకుడు కావడం ఖాయమన్న నమ్మకం కలిగిందంటూ ప్రశంసించాడు. సాహో కోసం గొప్ప సాంకేతిక నిపుణులు పనిచేశారని అంటూనే, సినిమాటోగ్రాఫర్ మది, సాబుసిరిల్, ఎడిటర్ శ్రీకర్‌ప్రసాద్, కమల్ కణ్ణన్, నేపథ్య సంగీత దర్శకుడు జిబ్రాన్.. సాహోకి అంతర్జాతీయ స్థాయి తీసుకొచ్చారని కితాబిచ్చాడు. ప్రాజెక్టు కోసం రెండేళ్లు కష్టపడినా -జాకీష్రాఫ్, చుంకీపాండే, అరుణ్‌విజయ్, లాల్, నీల్‌నితిన్ ముఖేష్, మందిరాబేడిలాంటి గొప్పవాళ్లతో పనిచేయడం మంచి అనుభూతినిచ్చిందన్నాడు. ఒక నటి ఒక ప్రాజెక్టు కోసం రెండేళ్లు కేటాయించటం చిన్న విషయం కాదంటూ, ఈ ప్రాజెక్టుకు శ్రద్ధాకపూర్ ఓకే చెప్పడం మా అదృష్టం అన్నాడు. వ్యాపార లాభాల ప్రామాణికతను పక్కన పెట్టేసి -ఇంత భారీ సినిమా తీసిన నిర్మాతల్లాంటి స్నేహితులు అందరికీ ఉండాలి అన్నాడు.
రెబెల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ -ట్రైలర్‌తోనే ఓ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో నిలిచింది. హాలీవుడ్‌తో పోటీపడే సినిమా అంటూ ఎంతోమంది ఫోన్లు చేసి చెప్పారు. యాక్షన్ సినిమాకు ప్రాణమైన పోరాట ఘట్టాల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మాస్టర్ కెన్నీ బేట్స్‌ను అభినందించాలి. ప్రభాస్ పడిన కష్టం, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను మోసిన సుజీత్ పనితనం, కథపై నమ్మకంతో బడ్జెట్ తెగింపు చూపించిన నిర్మాతల నిబ్బరం.. ఇవేమీ వృధాపోవంటూ ఆశీర్వదించారు. అంచనాల మాటెలావున్నా నటుడిగా యాభైయేళ్ల అనుభవంతో చెబుతున్నా, సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అన్నారు.
సినిమా హిట్టవ్వాలని ఫస్ట్ కోరుకునేది ఫ్యానే్స. వాళ్ల ఆకాంక్షను సాహో నెరవేరుస్తుందన్నారు దర్శకుడు రాజవౌళి. ప్రభాస్ సానుకూల ఆలోచనలు, దృక్ఫథమే ఇంతమంది అభిమానుల్ని సంపాదించిపెట్టిందన్నారు. బాహుబలి సినిమా చేస్తున్న టైంలోనే -తరువాతి ప్రాజెక్టు కోసం తపనపడటం ప్రభాస్‌లో చూశానన్నారు. ‘ఓరోజు ప్రభాస్ వచ్చి సుజీత్ చెప్పిన కథ బావుందంటూ ఉత్సాహంగా చెప్పాడు. అలా బాహుబలి తరువాత ఇలాంటి సినిమా చేస్తే జనాలకు నచ్చతుందన్న నమ్మకంతో చేసిందే సాహో’ అన్నారు. భారీ ప్రాజెక్టు కనుక సుజీత్ సమర్థతపై అనుమానాలు కమ్ముకున్నాయని, అయితే ఫస్ట్‌లుక్‌తోనే వాటికి సమాధానమిచ్చాడన్నారు. అందుకే సుజీత్ భుజాలపై సాహో ఉన్నాడంటూ కితాబిచ్చారు. ప్రభాస్ ఇప్పటికే ఆల్ ఇండియా స్టార్ అయ్యాడని, అతన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ -ప్రభాస్ స్వచ్ఛమైన మనిషి. అందుకే ముసలోళ్లనుంచి పసిపిల్లల వరకూ అందరికీ డార్లింగే. రెండేళ్ల ముందు రాజవౌళితో కలిసి చరిత్ర సృష్టించాడు. ఆ హిస్టరీని రిపీట్ చేస్తూ సాహోతో దేశం దద్దరిల్లాలి అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ -మిస్టర్ పెర్ఫెక్ట్ కంటే మిర్చికి బడ్జెట్ ఎక్కువ పెట్టారేంటని అడిగితే -మా ప్రభాస్‌కే కదా అన్నారు నిర్మాతలు. బాహుబలి 2 కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి సాహో తీస్తున్నపుడూ ఇదే ప్రశ్న వేశా వాళ్లను. వాళ్లు మళ్లీ -మా ప్రభాస్‌కే కదా అంటూ సమాధానమిచ్చారు. నన్ను చూసి నిర్మాతలం అయ్యామని వాళ్లు చెప్పుకుంటారు కానీ, దేశవ్యాప్తంగా సెనే్సషన్ సృష్టించే ఓ సినిమా ఎలా తీయాలోనని వాళ్లను చూసి నేర్చుకుంటున్నా’ అన్నారు. సుజీత్ అదృష్టవంతుడని, పాన్ ఇండియా సినిమా తీయడానికి రాజవౌళికి పదిహేనేళ్లు పడితే, రెండో సినిమాకే సుజీత్ ఆ ఘనత దక్కించుకున్నాడని అన్నారు. తెలుగోడు గర్వంగా చెప్పుకునే విజయం సాహో సాధించాలని ఆకాంక్షించారు. హీరోయిన శ్రద్ధాకఫూర్ మాట్లాడుతూ -నా తొలి తెలుగు సినిమా ప్రభాస్‌తో చేయడం అదృష్టమేమో. టీంతో సాగిన సాహో జర్నీ లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేనిది. సాహో ప్రాజెక్టుకు సుదీర్ఘంగా పనిచేయడంతో హైదరాబాద్ నా రెండో ఇల్లు అన్న భావనకు వచ్చేశానంటూ ఆనందం వ్యక్తం చేశారు. చిత్ర దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ -ప్రభాస్ ఫ్యాన్స్ ఓపికకు హ్యాట్సాఫ్. బాహుబలి తరువాత రెండేళ్లపాటు సినిమా కోసం ఎదురు చూశారు. అందుకే వాళ్లను డైహార్డ్ ఫ్యాన్స్ అంటున్నా. ప్రాజెక్టు విషయంలో ఇంత కాన్ఫిడెంట్‌గా ఉన్నానంటే అందుకు కారణం ప్రభాస్ అన్నాడు. నిర్మాత అల్లు అరవింద్, నటుడు మురళీశర్మ, కళా దర్శకుడు సాబు సిరిల్, అరుణ్, కృష్ణకాంత్, రవివర్మ మాట్లాడారు.

భారీస్థాయిలో నిర్మించిన సాహో కారణంగా ఏడాదికి రెండు సినిమాలు చేస్తానన్న మాట సాథ్యం కాలేదు. ఈసారి
మాటివ్వకుండానే చేసి చూపిస్తా -ప్రభాస్