29న పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినీత్, మోనికాసింగ్ జంటగా వి2 ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్మోహన్.సిహెచ్. దర్శకత్వంలో అశోక్ గోటి రూపొందించిన చిత్రం ‘పిడుగు’. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, హీరోగా పరిచయమవుతున్న వినీత్, కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటాడని తెలిపారు. ఫస్ట్ఫా అంతా లవ్‌ట్రాక్‌తో, సెకెండాఫ్ అంతా యాక్షన్ పార్ట్‌తో, ఎంటర్‌టైనర్‌గా రూపొందించామని, హీరో నాలుగు షేడ్స్ వున్న పాత్రలో నటించి మెప్పించాడని అన్నారు. నటన, ఫైట్స్, డాన్సులు అన్నీ ఆకట్టుకునే ఈ సినిమాను 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్నారు. మోనికాసింగ్, వినోద్‌కుమార్, బెనర్జీ, అనంత్, ఫణి, ముక్తార్‌ఖాన్, ప్రియాంక, సంధ్యాజనక్, ప్రభావతి, జూ.రేలంగి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:రమేష్ రాయ్, పాటలు:్భస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, వరికుప్పల యాదగిరి, సంగీతం:కార్తీక్, విజయ్ కూరాకుల, కెమెరా:పి.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్:కార్తిక శ్రీనివాస్, నిర్మాత:అశోక్ గోటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రామ్మోహన్.సిహెచ్.