వావ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరన్‌మ్యాన్ అప్పియరెన్స్‌కు దగ్గరగా బాలయ్య కొత్త గెటప్పు. లోడెడ్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో బ్యాంకాక్ స్టోరీ బ్యాక్‌డ్రాప్. ఈ రెండూ చాలు -దర్శకుడు కెఎస్ రవికుమార్ ఏ జోనర్‌లో సినిమా తెరకెక్కిస్తున్నాడో అంచనా వేయడానికి. బాలయ్య 105వ ప్రాజెక్టును కెఎస్ రవికుమార్ తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కొత్త ప్రాజెక్టు న్యూ లుక్‌ను మంగళవారం మేకర్స్ బయటకు వదిలారు. ఎన్బీకె న్యూ లుక్ షాకింగ్‌గా ఉంది. యంగ్ మేకోవర్‌లో ప్రత్యక్షమైన బాలయ్య -తాజా ప్రాజెక్టులో డాన్ పాత్ర పోషిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లు. ప్రకాశ్‌రాజ్, భూమిక, జయసుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం, రామ్‌ప్రసాద్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నారు. ‘జై సింహా’ తరువాత బాలకృష్ణ, నిర్మాత సి కల్యాణ్, కెఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇంతకుముందు యన్టీఆర్ బయోపిక్ చేసిన బాలయ్య, సంతృప్తికరమైన ఫలితం అందుకోలేకపోయారు. అందుకే -ఈసారి క్రైమ్ బేస్డ్ కథతో స్క్రీన్స్‌కు రానున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజులుగా ప్రాజెక్టు పనుల్లో బిజీగావున్న ఎన్బీకె -్థయ్‌లాండ్ షూట్‌లో ఉన్నారు. లోకల్ స్టంట్ కొరియోగ్రాఫర్స్‌తో అక్కడే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తున్నారు. బాలయ్య లుక్ రిలీజ్ అవ్వగానే ట్విట్టర్‌లో పోస్ట్‌లు
పెరిగాయి. న్యూలుక్‌కు నెటిజన్లు ఫిదా
అవుతుంటే -మీమ్స్‌ను తయారు చేసి
కొందరు షేర్ చేస్తున్నారు. ఐరన్‌మ్యాన్‌తో
కంపేర్ చేస్తూ కామెంట్లు చేస్తుండటం గమనార్హం.