రుద్రనేత్ర సైరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలతీరింది: చిరు
సైరా సినిమాతో చిరకాల కల నెరవేరింది. పోరాటయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చాలామందికి తెలీదు. ఆయన గురించి చెప్పే కథను పాన్ ఇండియాగా తీయాలనుకున్నా. కథ చాలా ఏళ్లక్రితమే నావద్దకొచ్చినా -బడ్జెట్‌పై ధైర్యం చేయలేకపోయా. ఇప్పుడు పరిస్థితులు మారాయి. నిర్మాత రామ్‌చరణ్ ధైర్యం చేశాడు. నా కల నెరవేర్చారు. అందుకే -బాధ్యతగా ఫీలై చేశాను. బాలీవుడ్‌లోనూ విడుదల చేస్తున్నారు. నా దృష్టిలో ఇదో బెస్ట్ కంటెంట్.

వినలేదు..
యాక్షన్ సీక్వెన్స్ ఈ వయసులో కష్టమని చెప్పినా -గ్రాఫిక్స్ ఉపయోగించటానికి సురేందర్, రామ్‌చరణ్ ఒప్పుకోలేదు. శ్రమించటమంటే ఇష్టమన్న నా బలహీనతను పట్టుకుని కత్తిసాము చేయించారు. గుర్రపుస్వారీ చేయించారు. అందుకే భుజానికి ఆపరేషనైవున్నా, సైరా జర్నీ ఎంజాయ్ చేశా.

మెగాస్టార్
నాకు తెలిసి ఓకే ఒక్క మెగాస్టార్ -అమితాబ్ బచ్చన్. ఆయనే రియల్ లైఫ్ మెంటార్ కూడా. కలిసి పనిచేసిన అనుభవం -అద్భుతం. చిత్రంగా సైరాలో ఆయన పోషించిన పాత్రా -నా గురువే. దర్శకుడి ప్రతిపాదన మేరకు అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.

చరిత్ర స్మరించుకుంటుంది -ఝాన్సీ లక్ష్మీబాయ్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్‌సింగ్‌లాంటి ఎందరో మహనీయుల ప్రాణత్యాగాలను.
కాని, ఆ చరిత్ర పుటల్లో కనుమరుగయ్యాడు ఒక వీరుడు. ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ్భేరి మోగించిన రేరాటి సూర్యుడు -అంటూ పవన్ కల్యాణ్ గొంతులో ‘సైరా’ పరిచయమయ్యాడు. కొద్దిరోజులుగా ఫ్యాన్స్‌ను ఊరిస్తోన్న మెగా టీజర్ అనుకున్న టైంకే వచ్చింది. పూర్తి యాక్షన్ కంటెంట్‌గా చూపించిన పోరాట సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికలిగించాయి. తాజా ప్రచార చిత్రంలో భారీతనం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. బ్రిటీషర్లపై పోరాటం సలిపిన తొలి తెలుగు వీరుడి జీవిత కథగా చిత్రబృందం చెబుతోన్న కథలో -నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి పోషిస్తున్నారు. నయనతార, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, జగపతిబాబు తదితరులు ప్రధాన పాత్రలుగా టీజర్‌లో పరిచయమయ్యారు. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్ -సైరాను నిర్మించాడు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని అక్టోబర్ 2న థియేటర్లకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న సినిమాపై విశేషమైన అంచనాలే నెలకొన్నాయి. ‘చరిత్రలో మనం ఉండకపోవచ్చు. కాని చరిత్ర ఈ రోజు మనతోనే మొదలవ్వాలి’ అంటూ టీజర్‌లో చిరు చెప్పిన డైలాగ్ -సైరా స్టామినాను చెప్పకనే చెబుతోంది.
ముక్తాయింపు: ఉయ్యాలవాడ చారిత్రక కాలమానాన్ని ప్రతిబింబించటంలో -దర్శకుడు ఒకింత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న భావన కలిగింది. పోరాటం కంటే యుద్ధ సన్నివేశాలుగా కనిపించిన దృశ్యాలు -ఐతిహాసిక, జానపద చిత్రాల దృశ్యాలను తలపింపచేయటం గమనార్హం.