కౌసల్య.. సక్సెస్ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐశ్వర్యా రాజేష్, రాజేంద్రప్రసాద్, కార్తీక్‌రాజు, వెనె్నల కిషోర్ ముఖ్య పాత్రలుగా క్రికెట్ నేపథ్యంలో భీమనేని శ్రీనివాస రావు తెరకెక్కించిన చిత్రం -కౌసల్యా కృష్ణమూర్తి. కెఎస్ రామారావు సమర్పణలో కెఎ వల్లభ నిర్మిస్తోన్న విభిన్న కథా చిత్రమిది. ప్రత్యేక పాత్రలో తమిళ హీరో శివకార్తికేయన్ చేస్తున్నాడు. విడుదలకు సిద్ధమైన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, రాశిఖన్నా ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కెఎస్ రామారావు మాట్లాడుతూ -క్రాంతిమాధవ్ ఈ సినిమా గురించి చెప్పినపుడు, ఐశర్య పెర్ఫార్మెన్స్ చూసి తమిళ చిత్రం ‘కణ’ రైట్స్ తీసుకున్నాం. భీమినేనికి బాధ్యతలు అప్పగించటంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. రాజేంద్రప్రసాద్, ఐశ్వర్య సినిమా కోసం చాలా కష్టపడ్డారు. సెలెక్టివ్‌గా సినిమాలు చేసే క్రియేటివ్ కమర్షియల్స్ ఈ స్థాయిలో ఉండటానికి -కోదండ రామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కె విశ్వనాథ్, అజయ్‌లాంటి దర్శకులు ఇచ్చిన కంటెంట్, కృషే. తమిళ సోల్ మిస్సవకుండా సినిమాను ఉన్నతంగా చూపేందుకు దర్శకుడు భీమినేని చాలా కష్టపడ్డారు. 2019లో ఓ మంచి సినిమా చూశామన్న భావన ఆడియన్స్‌లో కచ్చితంగా ఉంటుంది అన్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ -పెళ్లిచూపులు ప్రాజెక్టు తరువాత ఓ సినిమా చేద్దామంటూ కెఎస్ రామారావు, క్రాంతిమాధవ్ కలిశారు. అలా సెట్టయిన ప్రాజెక్టు షూట్ నుంచే ఇక్కడికి వచ్చాను. ప్రాజెక్టులో ఐశ్వర్య రాజేష్ కూడా పాత్ర చేస్తోంది. మంచి పెర్ఫార్మర్‌తో కలిసి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉంది. సెట్‌లో కెఎస్ రామారావును డాడీ అని పిలుస్తామంటే -ఆయనతో ఉండే అనుబంధం అంచనా వేసుకోవచ్చు. దర్శకుడు భీమినేని సహా ఎంటైర్ టీంకి ఆల్ ది బెస్ట్. 23న విడుదలవుతోన్న సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. చిత్ర దర్శకుడు భీమినేని మాట్లాడుతూ -కౌసల్య కృష్ణమూర్తి అందరికీ ఓ స్పెషల్ ఫిల్మ్. సినిమాయే జీవితం కనుక, ప్రతి చిత్రాన్ని ఫ్యాషనేట్‌గా చేయడానికి ప్రయత్నిస్తా. రీమేక్ అయినా సినిమాను ఎంతో బెటర్ చేశాం. డెఫినెట్‌గా సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ -ఇది నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్. 25 సినిమాల తరువాత తమిళంలో నేను చేసిన ఫిమేల్ ఓరియంటెండ్ సినిమా ‘కణ’. అలాంటి సినిమా ఇచ్చిన శివకార్తికేయన్, అరుణ్ రాజా కామరాజ్‌కి ధన్యవాదాలు. ఇక్కడ తొలి తెలుగు సినిమాకే కణలాంటి చాన్స్ వచ్చింది. అదే కౌసల్య కృష్ణమూర్తి. ఒరిజినల్ కంటెంట్ మిస్ కాకుండా దర్శకుడు భీమినేని నూరుశాతం న్యాయం చేశారు. తమిళంకంటే తెలుగులో మరింత హిట్టవుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్, పోకూరి బాబూరావు తదితరులు మాట్లాడారు.