చిరు ఫ్యాన్స్‌ని మురిపిస్తుంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోహన్‌కృష్ణ, హరిణిరెడ్డి హీరో హీరోయిన్లుగా దర్శకుడు సిహెచ్ రవికిషోర్‌బాబు తెరకెక్కిస్తోన్న చిత్రం గ్యాంగ్‌లీడర్. మళ్లీ మొదలవుతుంది రచ్చ టాగ్‌లైన్. మాణిక్యం మూవీస్, ఎస్‌ఎమ్‌కె ఫిలిమ్స్ పతాకాలపై సింగులూరి మోహన్‌రావు నిర్మిస్తోన్న చిత్రం. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా మెగా అభిమానుల సమక్షంలో అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు సినిమా టీజర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు సిహెచ్ రవికిషోర్‌బాబు మాట్లాడుతూ -షూటింగ్ దాదాపు పూరె్తైంది. చిరంజీవి సూపర్ హిట్ సినిమా టైటిల్ కావడంతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాం. మెగా ఫ్యాన్స్‌ను మురిపించేలా సినిమా ఉంటుంది. సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెస్తాం అన్నారు. హీరో మోహన్‌కృష్ణ మాట్లాడుతూ -్ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌కు మంచి అప్లాజ్ వచ్చింది. అభిమాన హీరో చిరంజీవి బర్త్ డే సందర్భంలో సినిమా టీజర్ విడుదల చేయటం హ్యాపీగా ఉంది. సుమన్, తనికెళ్ల భరణి, రంగస్థలం మహేష్, చిత్రం శ్రీను, రావు రమేష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.