ఈసారి ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్‌తో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అక్కడొకడుంటాడు’తో నటుడిగా పరిచయమైన శివ కంఠమనేని తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. లైట్‌హౌస్ సినీ మేజిక్ పతాకంపై మరో ప్రాజెక్టు చేయడానికి సిద్ధమయ్యాడు. జి రాంబాబుయాదవ్, ఆర్ వెంకటేశ్వరరావు, కెఎస్ శంకరరావు, వి కృష్ణారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 24న లాంఛనంగా ప్రారంభిస్తోన్న చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించనున్నాడు. నందితా శే్వత, రాశి, కె అశోక్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -శివ కంఠమనేని ప్రధాన పాత్రగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను శనివారం ప్రారంభిస్తున్నాం. అదే రోజునుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, రెండు షెడ్యూళ్లలో సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేశాం. సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అజయ్, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, బిత్తిరి సత్తి, అజయ్‌ఘోష్, ఆదిత్యామీనన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.