12 గెటప్‌లలో ఆదర్శ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ ఓండి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ఆదర్శ్‌బాబు, పావని జంటగా అజ్మీరాచంద్ దర్శకత్వంలో ఎ.ఎస్.రావు రూపొందిస్తున్న యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం నాన్న నేను వర్ష. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, కథాపరంగా నటీనటులను ఎంచుకొని రూపొందించిన ఈ చిత్రంలో డాన్స్, ఫైట్స్, డైలాగులు హైలెట్‌గా ఉంటాయని, కథానాయకుడు 12 గెటప్‌లతో చేసిన యాక్షన్ అందరికీ నచ్చుతుందని తెలిపారు. హీరోయిన్ పావనికి ఈ చిత్రం తర్వాత అవకాశాలు బాగా వస్తాయని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, సినిమా కూడా అంతే వేగంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కోటేశ్వరరావు, చలాకీ చంటి, స్నేహ, హారిక, గంగూభాయి, దిలీప్, రాము, శివ, శోభ, శ్రావణ్, రఘు, సమీర, అక్షయ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: విశ్వత్‌చందు, దాస్, ఆదిత్య, లక్ష్మణ్, సంగీతం: డేవిడ్, కెమెరా: డి.విజయ్‌కుమార్, ఎడిటింగ్: అనిల్‌రాజు, రచన, దర్శకత్వం: అజ్మీర చందు.

చిత్రం పావని