కరుణాకరన్ దర్శకత్వంలో శర్వానంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న కరుణాకరన్‌కు ఈమధ్య సరైన హిట్స్ లేవు. చేసిన సినిమాలు బాక్స్‌ఆఫీసువద్ద బోల్తా కొడుతుండడంతో కెరీర్ డీలాపడింది. ప్రేమకథలను బాగా డీల్ చేయగల ఈ దర్శకుడు ఈసారి హ్యాట్రిక్ హీరోను పట్టేసాడు. అతడెవరో కాదు శర్వానంద్. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా కొలిక్కి వచ్చాయని, కథతోపాటు స్క్రిప్ట్ కూడా ఓకే అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి రానుందట. మరోవైపు శర్వానంద్ ‘కుమారి 21ఎఫ్’ దర్శకుడు సూర్యప్రతాప్‌తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఆ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అవుతోంది. కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందే సినిమాను బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తాడని అంటున్నారు. మరి శర్వానంద్ కోసం కరుణాకరన్ ఎలాంటి ప్రేమకథ చెబుతాడో చూడాలి!