ఆటకు అంతా సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జిఫిలిమ్స్ పతాకాలపై జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం రా’ (జస్ట్ ఛిల్). ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్ అందరికీ నచ్చుతుందని, సుశాంత్‌కు వందశాతం యాప్ట్ అయ్యే కథనంతో రూపొందించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం పాత్ర హైలెట్‌గా ఉంటుందని తెలిపారు. కామెడీకోసం టైమ్ మిషన్ సెట్ వేసి, చక్కగా చిత్రీకరించామని, నిర్మాణ విలువలు బాగున్నాయని తెలిపారు. పాటలు హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో కథాకథనాలు అందరికీ నచ్చుతాయని, గౌతమ్‌రాజ్ ఎడిటింగ్ సరికొత్తగా ఉంటుందని అన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా హీరో పాత్ర హైలెట్‌గా ఉండే ఈ చిత్రంలో ఏ సమస్య వచ్చినా చాలా తెలివిగా ఆ సమస్యను పరిష్కరించే కథానాయకుడుగా సుశాంత్ ఈ చిత్రంలో నటించారని నిర్మాతలు అన్నారు. త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. బ్రహ్మానందం, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిషోర్, రఘుబాబు, పృథ్వి, ఫిరోజ్ అబ్బాసి, సుధ, ఆనంద్, రమాప్రభ, రజిత నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: దాశరధి సివేంద్ర, ఎడిటింగ్: గౌతంరాజు, కథ, మాటలు: శ్రీ్ధర్ సీపాన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వర్‌రెడ్డి.