Others

ఫృథ్వీగర్భుని పత్ర పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ సంప్రదాయకులైనా బ్రహ్మ, విష్ణు, రుద్రులకు పరబ్రహ్మగా సాక్షాత్కరించే గణపతికి ప్రథమ ఆరాధన నిర్వహిస్తారు. వేదాలలో పేర్కొన్న పరమ తేజం. వినాయకుడే. గణపతిని మంత్ర, తంత్ర, విధి విధానాలతో కూడా పూజిస్తారు. అందులో పత్ర పూజ మరింత విశిష్టమైంది. గణపతిని పూజించే ప్రతిలోని పత్రాలన్నీ కూడా శాస్తర్రీత్యా ఔషధీగుణాలు కలిగున్నాయ. మాచీపత్రం: తలనొప్పి, వాతం నొప్పులకు, బృహతీ పత్రం: ఉబ్బసం, శే్లష్మ వ్యాధినివారణకు, బిల్వపత్రం: పుచ్చురాకుండుటకు, విరోచనాలకు విరుగుడుగా, గఱిక: ఎదురుదెబ్బల గాయాలు మాన్పడానికి, దత్తూరపత్రం: గడ్డలు, వ్రణాలు తగ్గడానికి, బదరీ పత్రం: జీర్ణకోశవ్యాధినివారణకు, అపామార్గ పత్రం : పంటిజబ్బులకు, తులసీ పత్రం: అజీర్ణం, కడుపునోప్పిలాంటివి తగ్గడానికి, చూత పత్రం, మామిడాకు:గృహాలంకరణకే కాక రక్తఅతిసారాన్ని తగ్గించడానికి, కరవీర పత్రం: గనే్నరు ఆకులు కంతులను కరిగించడానికి, కుష్టును పోగొట్టుకోవడానికి విష్ణుక్రాంతపత్రం: పైత్యజ్వరాలను, కఫజ్వరాలను తగ్గించడానికి, దాడిమీ పత్రం పత్రం:జీర్ణకోశ, మలాశయ వ్యాధుల నివారణకు, దేవదారు పత్రం: మేహశాంతికోసం, మరువక పత్రం: ఇంద్రియ పుష్టికోసం, సింధూర పత్రం: ఉబ్బులను, ఇరుకు నొప్పులకు, జాజి ఆకు:వాత పైత్యాలకు, గండకీ పత్రం: ఇది ప్రత్యేక ప్రదేశాలలో దొరికే ఆయుర్వేద ఔషధం, అశ్వత్థపత్రం: నోటిపూతకు, ఆస్తమా నివారణకు, అర్జున పత్రం: చెవినొప్పులకు, గాయాలు, వ్రణాలు తగ్గడానికి , అర్క పత్రం: జిల్లేడు ఆకులు డాక్టరు పర్యవేక్షణలో ఉపయోగించాల్సిన ఔషధం, ఇలా వినాయకుణ్ణి పూజించే పత్రాలలో ఇన్ని రకాల ఔషధీ రహస్యాలున్నాయి. అందుకే మట్టితో తయారు చేసే వినాయకుడికి పత్రపూజ చేయడంలోని అంతరార్థాన్ని గ్రహించి కొలిచే భక్తులకు సిద్ధి బుద్ధులను ప్రసాదించి అను గ్రహిస్తాడు ఆ గణపతి.
ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు వాయువులు (వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపానములు- ఐదు వాయువులు), నాలుగు అంతఃకరణములు (మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము- నాలుగు) వెరశి పంధొమ్మిది. సూక్ష్మ శరీర తత్త్వాలను దాటితే మహాతత్త్వము, అది దాటితే అవ్యక్త తత్త్వము. ఈ 21 తత్త్వాలను దాటితే మనలో వున్న ఆత్మ అంతటా నిండి వున్న పరమాత్మలో లీనమవుతుంది. అందుకే గణపతిని 21 రకాల పత్రితో పూజిస్తారు. ఇది గణపతి పత్రి పూజ విశేషం. వినాయక చవితి ప్రతిమలు మట్టివైతే ప్రగతికి, పురోగతికీ నిదర్శనాలు అవుతాయని అంటారు. అంతేకాదు పార్వతీనందనుడికి చేసే పూజవల్ల భక్త్భివం, సంఘీభావం ఐక్యత జనుల్లో పెరగాలని, సౌభాతృత్వంతోను, స్నేహ సౌభాగ్యం తోను కలసి మెలసి జీవన యాత్ర చేస్తూ స్నేహసౌభాతృత్వాలను పుణికి పుచ్చు కోవాలని ఆశిస్తూ ప్రకృతికి ప్రతి రూపమైన విఘ్నేశ్వరున్ని విఘ్నేశ నవరాత్రుల పేరిట అందరం మహోత్సవాలను జరుపుకుందాం. ప్రతి ఏటా సంతోషతరంగాలతో వినాయకుని సంబరాలను చేసుకొందాం.

- జి.వివేక్