Others

కరివదనునికి కోటి దండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐహికం, ఆధ్యాత్మికం అయిన జగద్విజ్ఞానమంతా గణేశుని ఆధీనమే. రుగ్వేదం గణపతిని గణాధిపతి, సర్వమంత్రాధిపతి, బ్రహ్మాది దేవతలలో శ్రేష్ఠుడు అని పేర్కొంది. గణ శబ్దంలో ‘గ’అంటే విజ్ఞానమని, ‘ణ’ అంటే మోక్షమని బ్రహ్మ వైవర్తన పురాణం చెబుతోంది. దేశకాలాతీతమై, త్రిగుణాతీతమై అస్థిత్వం- అనస్థిత్వం లేనిదై, అద్వైతమై, అవస్థాత్రయానికి సాక్షియై, నిర్గుణ బ్రహ్మ స్వరూపమైన గణేశుడు సమస్త విశ్వానికీ నాయకుడు.
వక్రతుండ, మహోదర, ఏకదంత, గజానన, లంబోదర, వికటుడు, విఘ్నరాజు, దూమ్రవర్ణ అని గణపతి ఎనిమిది అవతారాలను ఎత్తినట్లుగా ముద్గల పురాణం పేర్కొంది. ప్రతి యుగంలోను ఆవిర్భవించి అసురులను దునుమాడి ధర్మ ప్రతిష్ఠాపన చేసే గణపతి 32 రూపాలలో దర్శనం ఇస్తాడు. అందులో 21 (ఏకవింశతి) రూపాలు ప్రధాన గణపతులని మిగిలిన 11 (ఏకాదశ) రూపాలు ‘అవాంతరభేధ గణపతులు’ అని గణపతి స్వరూపాలుగా వర్గీకరించారు. 1) ప్రధాన గణపతులు (21)- 1.శ్రీ 2.వీర 3.శక్తి 4.వృత్త 5.విఘ్న 6.లక్ష్మీ 7.నృత్త 8.నృత్య 9.మహా 10.బీజ 11.డుంఢి 12.పింగళ, 13హరిద్రా 14.ప్రసన్న 15.వాతాపి 16.హేరంభి 17.వక్రతుండ 18.వరసిద్ధి 19.చింతామణి 20.సంకష్టహర 21.త్రైలోక్యమోహన గణపతులు.2)అవాంతరబేధ గణపతులు (11) 1.్భక్త 2.బాల 3.తరుణ గణపతులు ముగ్గురూ ‘శ్రీ గణపతి’ వర్గం 4.ఇచ్ఛిష్ణ 5.ఉన్మత్త గణపతులు ఇద్దరూ ‘వీరగణపతి’ వర్గం 6.విద్య 7.దుర్గ 8.విజయ గణపతులు ముగ్గురూ శక్తి గణపతి రూపాలు. 9.త్య్రక్షర 10.త్రిముఖ 11.ఏకాక్షర గణపతులు మువ్వురూ ‘పింగళగణపతి’ విభిన్నరూపాలు. విష్ణుమూర్తి అవతారాల సంఖ్య 10, రుద్రుల సంఖ్య 11 కలిపి 21 (ఏకవింశతి) అవుతుంది. అందుకే శివ కేశవ భేదాలు లేని ఆ గణపతిని ఏకవింశతి (21) పత్రాలతో ఆ 21 మూర్తుల్నీ పూజిస్తారు.
స్కాందపురాణం ప్రకారం ఈ గణపతే- ఒకసారి పార్వతిదేవి అభ్యంగన స్నానం కోసం తయారుచేసిన నలుగుపిండి తో బొమ్మచేసి ప్రాణంపోసి తనకు కాపలా కాయుమని చెప్పిందట. అపుడే శివుడు కైలాసం రాగా అమ్మచెప్పిన ప్రకారం కాపలా కాస్తున్నపిల్లవాడు శివుడినే లోపలికి వెళ్లరాదని శాసించాడట. దాంతో కోపం తెచ్చుకొన్న పరమశివుడు బాలుని శిరస్సును ఖండించాడు. విషయం తెలుసుకొన్న పార్వతీదేవి ఈ బిడ్డడు మన బాలుడని చెప్పగా జరిగిందానికి వగచి పరమశివుడు తన భక్తుడైన గజాసురుని శిరస్సును బాలునకు అమర్చమని చెప్పాడు. దీనివల్ల ప్రథమ పూజలందుకొనే గణనాథుని ఈ రూపం వచ్చింది. ఋగ్వేదంలో గణపతి వేదాలకు, జ్ఞానములకు, కర్మిష్టులకు, సర్వ వ్యాపక శక్తులకు ప్రభువని సర్వగణాలకు అధిదేవతని, సర్వాహ్లాదకరుడని సర్వులకు జ్యేష్టుడని, అధినాయకుడని, ఉత్తమ కీర్తి సంపన్నుడని వర్ణింపబడ్డాడు. గణపత్యధర్వ శీర్షోపనిషత్తులో గణపతి సర్వవ్యాప్తమైన పరబ్రహ్మ స్వరూపమని సృష్టి, స్థితి లయములకు కారకుడని, సర్వ కార్యములకు సృష్టికి కర్త, హర్త అని ఆనందమయుడని, చిన్మయుడని, లంబోదరుడని, శూర్పకర్ణుడని, రక్తాంగుడని వర్ణించారు.
ఎనె్నన్ని విధాలుగా భావించి అర్చించినా పరమాత్మ సత్యధర్మాలను పాటిస్తూ పూజించి నట్లయతే ఏరూపంలో కోరుకుంటే వ్యక్తమవు తాడు. కోరిన కోర్కెలను తీరుస్తాడు.

- గున్న కృష్ణమూర్తి