గ్రేట్ సాహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాక్‌తో సంబంధం లేకుండా సాహో సత్తా చాటుతున్నాడు. సినిమాలో పసలేదంటూ సమీక్షకులు యునీక్ స్టేట్‌మెంట్ ఇచ్చేసినా -తొలి వారాంతంలో కలెక్షన్ల రికార్డు ట్రేడ్ పండితులకే విస్మయం కలిగిస్తోంది. వినాయక చవితి రూపంలో సోమవారం సెలవు కలిసి రావడంతో -మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్‌ని సాహో దాటేశాడంటూ కథనాలు వస్తున్నాయి. అటు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ రేసులో, ఇటు సౌత్‌లోని ఆల్‌టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్ మార్క్‌లో సాహో రికార్డులే సృష్టించాడని అంటున్నారు. సౌత్ హయ్యస్ట్ గ్రాసింగ్‌లో సాహో సిక్స్త్ ప్లేస్‌లో ఉన్నాడని వినిపిస్తోంది. రికార్డు సృష్టించిన ఆరు చిత్రాల్లో మూడు రజనీకాంత్ సినిమాలైతే, మూడు ప్రభాస్ సినిమాలే కావడం మరో విశేషం. తెలుగు రాష్ట్రాల్లోనే ఒక్కోచోట ఒక్కోలా సాహోకి ఆదరణ దక్కుతున్నా, ఆ లోటును బాలీవుడ్ భర్తీ చేసేస్తోందట. బాలీవుడ్‌లో తొలి నాలుగు రోజుల్లో వంద కోట్ల నెట్ కలెక్షన్లు -ట్రేడ్ విశే్లషకుల అంచనాలకూ అందనిదే. వంద కోట్ల మార్క్ -ఒక్క సల్మాన్ సినిమాలకే నిలకడగా నడుస్తుంది. హిట్టు టాక్‌పడిన సందర్భాల్లోనే అక్షయ్, అజయ్ దేవగన్ చిత్రాలు ఆ మార్క్‌ని టచ్ చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డివైడ్ టాక్ వచ్చిన సాహో మాత్రం కోట్ల కలెక్షన్స్ సాధించటం అనూహ్య పరిణామమే. అడ్వాన్స్ బుకింగ్‌ల కారణంగా తొలి నాలుగు రోజుల వసూళ్లు బావుంటాయని అంచనా వేసినా -అంచనాలకు మించి సాహో చూపుతోన్న స్టామినా గ్రేట్ అచీవ్‌మెంట్‌గానే భావించాలి.