ఆ వజ్రాలు ఆనందాన్నిస్తాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.ఎస్.ఎల్ ఫిలిమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిరణ్, సుమి, గిడ్డేష్, సమీర ప్రధాన తారాగణంగా శేఖర్‌చంద్ర దర్శకత్వంలో కరె శ్రీనివాస్ రూపొందిస్తున్న చిత్రం వజ్రాలవేట. ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్‌చంద్ర మాట్లాడుతూ, ఒకేసారి వేల కోట్లు సంపాదిస్తే ఆ ఆనందం ఎలా ఉంటుంది అన్న కథనంతో అడవిలోకి వెళ్లిన పాత్రలు ఎటువంటి పరిణామాలను ఎదుర్కొన్నాయి అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని, మహానంది, నంద్యాల, గాజులపల్లె, ఓర్వకల్లు, కర్నూలు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని తెలిపారు. ఛేజింగ్ ఎపిసోడ్స్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రంలో విలన్ గ్యాంగ్‌ను హీరో హీరోయిన్లు ఎలా ఇబ్బందులు పెట్టారు అన్న అంశం హాస్యభరితంగా ఉంటుందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. వినోద్‌కుమార్, శివసత్యనారాయణ, హసన్, మహేశ్వర ఆచారి, నందిని తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: బి.వి.రావు, నిర్మాత: కరె శ్రీనివాసులు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేఖర్ చంద్ర.