టిమా వృద్ధిలోకి రావాలి: గీతాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మంచి ఉద్దేశంతో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తొందర్లోనే వృద్ధిలోకి రావాలని సీనియర్ నటి గీతాంజలి ఆకాంక్షించారు. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ కొత్తగా ఏర్పాటైన ‘టిమా’ కార్యవర్గాన్ని బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు. అధ్యక్షుడిగా జెవిఆర్, ఉపాధ్యక్షులుగా గీతాంజలి, బాలాజీ, దిలీప్ రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా స్నిగ్ధ మద్వానీ, సంయుక్త కార్యదర్శులుగా కిరణ్, లత, ధర్మారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా వై శ్రీనివాస్, ఆదర్శిని, యోగితోపాటు తొమ్మిదిమంది ఇసీలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆర్‌కె మాట్లాడుతూ -టిఎఫ్‌సిసిని వృద్ధిలోకి తెచ్చేందుకు శతవిథాలా కృషి చేస్తున్నామన్నారు. కొత్తగా ఏర్పాటైన మా చాంబర్ కేవలం తెలంగాణ నటీనటులకు చెందినదే కాదని, రెండు రాష్ట్రాలకు చెందిన నటీనటులు సభ్యులు కావొచ్చని అన్నారు. అందరి ఆమోదంతో కొత్తగా ఏర్పాటైన కార్యవర్గం తమ విధులను సక్రమంగా నిర్వర్తించగలదన్న ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ అన్నది ఒకటివున్నా -అది కేవలం డిస్ట్రిబ్యూటర్లకే పరిమితమైందన్నారు. ఈ కార్యవర్గంలో నిర్మాతలు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. అధ్యక్షుడు జెవిఆర్ మాట్లాడుతూ -మాపై నమ్మకంతో ‘టిమా’ బాధ్యతలు అప్పగించిన ప్రతానికి ధన్యవాదాలు. అసోసియేషన్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తా అన్నారు. టిఎఫ్‌సిసి ఉపాధ్యక్షుడు, నిర్మాత గురురాజ్ తదితరులు మాట్లాడారు.