నా కథకి నేనే హీరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐదేళ్లు చేసిన ఐటీ జాబ్ వదిలేసి -సినిమాపై ఆసక్తితో కథ రాశా. విజయ్ దేవరకొండతో సినిమా తీయాలన్నది ఆలోచన. విజయ్ దేవరకొండ అందనంత ఎత్తుకు ఎదిగిపోవడంతో -ఆ కథను తానే హీరోగా సినిమా చేశానంటున్నాడు శ్రీపవార్. శ్రీనిక క్రియేటివ్ వర్క్స్‌పై రూపొందిన చిత్రం -2 అవర్స్ లవ్. రచయిత, దర్శకుడు, హీరోగా పరిచయం అవతున్నాడు శ్రీపవార్. కృతిగార్గ్ హీరోయిన్. 6న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో -మీడియాతో మాట్లాడాడు శ్రీపవార్.
హైదరాబాద్‌లోనే పుట్టిపెరిగా. ఐదేళ్లపాటు ఐటీ జాబ్ చేసి -సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వచ్చేశా. బేసికల్‌గా రచన, దర్శకత్వం ఇష్టం. ఆ ఆసక్తితోనే ఏడాదిన్నరపాటు ఈ కథను సిద్ధం చేసుకున్నా.
ఈ స్టోరీ విజయ్ దేవరకొండకు సరిగ్గా సరిపోతుంది. ‘పెళ్లిచూపులు’ సినిమా తరువాత అలా ఫిక్సయ్యా. అప్పటికి 80శాతం కథే లాకైంది. మిగిలిన స్క్రిప్ట్ పూర్తి చేసేసరికి అర్జున్ రెడ్డి సైతం వచ్చేసింది. మరో రెండు మూడు సినిమాలు విజయ్ చేతిలో ఉండటంతో -నేనే చేయడానికి ఫిక్సైపోయా.
మన జీవితాల్లోని సంఘటనల సమాహారం చాలు సినిమా తీయడానికి. అలా రాసుకున్నదే -2 అవర్స్ లవ్. హీరోయిన్‌కు ఇంపార్టెన్స్ ఎక్కువ. సాయంత్రం 4కి ముందు, 6కి తరువాత ఏం జరిగినా ఆ అమ్మాయికి అసలు సంబంధం ఉండదన్న మాట. అదుకే టైటిల్ అలాపెట్టాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్. ప్రతి సీన్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఉంటుంది.
యాక్టింగ్ నేర్చుకుంటే వచ్చేది కాదని నా అభిప్రాయం. కాకపోతే యాక్టింగ్ స్కూళ్లు మనకున్న టాలెంట్‌కు మెరుగులు దిద్దుతాయి. కథకు రైటర్‌ని నేనే కాబట్టి ఏ ఎమోషనల్ ఎలా పండించాలో అవగాహన ఉంది. దాంతో హీరోగా నాపని సులువైంది.
మంచి ఉద్యోగం వదిలేసి వస్తున్నపుడు అమ్మానాన్నల నుంచి ఎలాంటి అభ్యంతరాలూ రాలేదు. ఎందుకంటే సినిమా అంటే వాళ్లకూ ఫ్యాషన్ ఉంది. మా పేరెంట్స్ చిరంజీవికి పెద్ద ఫ్యాన్స్.
తరువాతి ప్రాజెక్టుగా ఓ స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఇక, ఈ సినిమాను పీవీఆర్ సినిమాస్ విడుదల చేస్తోంది. చాలా హ్యాపీయెస్ట్ థింగ్. చిన్న సినిమా అన్నపుడు ఎవ్వరూ ముందుకు వచ్చే పరిస్థితి లేకున్నా -కంటెంట్ నచ్చి వాళ్లు ముందుకొచ్చారు. ట్రైలర్, పాటలకు ఇప్పటికే మంచి టాక్ వచ్చింది.
ఈ సినిమాకు కథ హైలెట్. తరువాత ప్రవీణ్ వనమాలి డీవోపీ ఓ అస్సెట్. గూఢచారి చిత్రానికి పని చేసిన అనుభవం మ్యూజిక్ డైరెక్టర్స్‌ది. ఆర్టిస్టులంతా పేరున్నవాళ్లే. పైగా చిక్ మంగుళూరు, బెంగళూరు, ముంబై, గోవా, హైదరాబాద్ పరసరాల్లో మంచి లొకేషన్స్‌లో షూట్ చేశాం. స్క్రీన్‌పై ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సో, బ్రోచెవారెవరు, గూఢచారి సినిమాల మాదిరిగా ఇదీ హిట్టవుతుందన్న నమ్మకంతో ఉన్నాం.