టుస్సాడ్స్‌లో శ్రీదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడమ్ టుస్సాడ్స్‌లో అతిలోకసుందరి ప్రత్యక్షమైంది. దివంగత నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని టుస్సాడ్స్ మ్యూజియంలో బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త, నిర్మాత బోనీకఫూర్, ఇద్దరు పిల్లల జాన్వీ, ఖుషీకఫూర్ సమక్షంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ‘దివినుంచి దిగివచ్చిన అతిలోకసుందరి’ అన్నంత అందంగా, జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దిన మైనపు విగ్రహం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోంది. 1987లో అనిల్ కఫూర్, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన ‘మిస్టర్ ఇండియా’ చిత్రంలోని హవా హవాయి పాటలో శ్రీదేవి వేషధారణ ఆధారంగా మైనపు విగ్రహాన్ని తీర్చిదిద్దినట్టు కనిపిస్తోంది. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలోని ఓ హోటల్ గదిలో ప్రమాదవశాత్తూ మరణించటం తెలిసిందే. సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన శ్రీదేవి మైనపు విగ్రహాన్ని టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేస్తామంటూ అప్పట్లో నిర్వాహకులు ప్రకటించారు. ఆమేరకు బుధవారం ఆమె మైనపు బొమ్మను టుస్సాడ్స్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోనీకఫూర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ -కళాకారిణిగా ఆమె కృషి, అంకితభావం అజరామరం. టుస్సాడ్స్ ఏర్పాటు చేసింది ఆమె విగ్రహం కాదు, జ్ఞాపకం. ఆమె ఎప్పటికీ మనమధ్యే ఉంటుంది’ అంటూ మనసులోని భావాన్ని వ్యక్తం చేశారు.