షాలినీ.. పంట పండింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డితో బ్లాక్‌బస్టర్ అందుకున్న షాలినీ పాండేకు -ఆలస్యంగానైనా ఆమె కష్టానికి తగిన అదృష్టం వెతుక్కుంటూ వచ్చిందట. నిజానికి అర్జున్‌రెడ్డిలో ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్‌కు -లెక్కలేనన్ని చాన్స్‌లు వరుస పెడతాయనే అంతా ఊహించారు. కాని సీన్ రివర్స్ అయ్యింది. అరకొర చాన్స్‌లు తప్ప, షాలిని కెరీర్‌ను మలుపుతిప్పే సినిమా ఒక్కటీ పడలేదు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని ఔపోసన పట్టిన షాలిని -ఏమాత్రం డీలా పడకుండా శరీరాకృతిని మరింత పదునుగా తీర్చిదిద్దుకోవడపై దృష్టిపెట్టింది. ఆమె వర్కౌట్స్ ఫలించి -ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపొచ్చిందట. తాజా సమాచారం ప్రకారం భారీ ప్రొడక్షన్ హౌస్ యష్‌రాజ్ ఫిల్మ్‌తో మూడు సినిమాల డీల్‌ను షాలిని కుదుర్చుకున్నట్టు టాక్. యష్‌రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చేవన్నీ భారీ సినిమాలే కనుక -మూడింటిలో ఏ ఒక్కటి ఆమెకు వర్కౌటైనా ఎక్స్‌పోజరే మారిపోవడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అర్జున్‌రెడ్డి ఇమేజ్ మొత్తం విజయ్ దేవరకొండ ఖాతాలో పడటంతో -ఆ పాత్రకు పూర్తి సపోర్ట్ అందించిన షాలిని మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఎలివేట్ కాలేకపోయింది. ఆ సినిమా భారీ హిట్టుకొట్టినా -తెలుగు ప్రాజెక్టుల్లో అవకాశాలు ఆమెతో దోబూచులాడాయి. ఇప్పుడు కలిసొచ్చిన అదృష్టంతో ఏకంగా బాలీవుడ్‌లో పెద్ద ప్రొడక్షన్ హౌస్‌తో మల్ట్ఫిల్ సినిమాల డీల్ సెట్ కావడంతో -షాలిని దశ తిరిగినట్టేనంటున్నారు.