27న వస్తున్న నిన్నుతలచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌ఎల్‌ఎన్ ప్రొడక్షన్స్, నేదురుమల్లి ప్రొడక్షన్స్‌పై అనిల్ తోట తెరకెక్కించిన క్యూట్ లవ్ స్టోరీ -నిన్నుతలచి. ఓబిలేష్ మొదిగిరి, నేదురుమల్లి అజిత్‌కుమార్ నిర్మాతలు. వంశీ యాకసిరి, స్ట్ఫెపటేల్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. సెప్టెంబర్ 27న సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో -చిత్రబృందం గురువారం మీడియాతో మాట్లాడింది. దర్శకుడు తోట అనిల్ మాట్లాడుతూ -ఇదో క్యూట్ లవ్ స్టోరీ. 27న సినిమాను మీముందుకు తెస్తున్నాం. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరో వంశీ మాట్లాడుతూ -నిన్నుతలచి విడుదల సందర్భంగా ఆడియన్స్ కోసం చిన్న కంటెస్ట్ నిర్వహిస్తున్నాం. మా టీం మెట్రోలో ప్రయాణిస్తూ -ప్రయాణికులకు ప్రాజెక్టు తరఫునుంచి 200 రీఛార్జ్ కార్డులు గిఫ్ట్‌గా ఇవ్వనున్నాం. ఇది నా డెబ్యూ మూవీ. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరోయిన్ స్ట్ఫె పాటిల్ మాట్లాడుతూ -సినిమా పూర్తికావడానికి నిర్మాత సహకారం ఎప్పటికీ మరువలేం. కోఆర్టిస్ట్ వంశీ సెట్స్‌లో చాలా కోపరేట్ చేశాడు. మా కష్టానికి తగినట్టు మంచి అవుట్‌పుట్ వచ్చింది అన్నారు. నిర్మాత అజిత్ మాట్లాడుతూ -27న థియేటర్లకు వస్తున్న ‘నిన్నుతలచి’ను ఆడియన్స్ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.