ఆత్మల నేపథ్యంలో రజనీకాంత్ డ్రెస్సింగ్ రూమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు లక్ష్మణ్ మురారి తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న చిత్రానికి ‘రజనీకాంత్ డ్రెస్సింగ్ రూమ్’గా ఖరారు చేశారు. కలర్ విజన్ అనే అంశం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆత్మల నేపథ్యం గూర్చి చర్చించనున్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మురారి మాట్లాడుతూ, 45 నిమిషాల గ్రాఫిక్స్ కార్యక్రమాల కోసం లాస్‌ఏంజిల్స్‌లోని ప్రిస్విన్ స్టూడియోతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. కథ విషయానికి వస్తే, ప్రపంచంలోని మానవులందరూ ఎన్నో రంగులను చూస్తారని, ఆ రంగులను మిగతా ఏ ప్రాణులు చూడలేవని అన్నారు. మనుషులు చూస్తున్న ప్రకృతిలోనే రంగులు కుక్కకు ఓ రకంగా, నెమలికి ఓ రకంగా, పిల్లులకు ఓ రకంగా, అలాగే క్రిమి కీటకాలకు, పాములకు, ఎలుకలకు వేరే రంగుల్లో కనిపిస్తాయని, ఈ ప్రపంచంలో ఓ జీవికి కనిపిస్తున్నట్టుగా ఇంకొక జీవికి కనిపించదని తెలిపారు. ఆత్మలకు ఏ రంగులు కనిపిస్తాయి అనే కథనంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, దెయ్యాలు ఉన్నాయా లేవా లేక మూఢ నమ్మకాలా అన్న కథనంతో సాగే ఈ చిత్రం సామాజిక కోణంలో రూపు దిద్దుకోనుందని, త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలను ప్రకటిస్తామని ఆయన అన్నారు.