సస్పెన్స్ థ్రిల్లర్ ఉందా.. లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూతన నటీనటులు రామకృష్ణ, ఆంకిత జంటగా జయకమల్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అమనిగంటి వెంకట శివప్రసాద్ దర్శకత్వంలో అయితం ఎన్.కమల్ రూపొందిస్తున్న చిత్రం ‘ఉందా.. లేదా..?’. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ సినిమా ఆఫీస్‌లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట శివప్రసాద్ మాట్లాడుతూ.. విజయవాడ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందనుందని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తిచేశామని తెలిపారు. వచ్చేనెల రెండో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ చేయనున్నామని, మొత్తం సినిమా అంతా విజయవాడలోనే మూడు షెడ్యూల్స్‌లో పూర్తిచేస్తామని ఆయన అన్నారు. కొత్తవారితోపాటుగా కీలకమైన పాత్రల్లో సీనియర్ నటీనటులు నటిస్తున్నారని, ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటిస్తామని అన్నారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో వైజాగ్‌లో ఆడిషన్స్ నిర్వహించి, 20 మందిని ఎంపికచేసి ఈ చిత్రం ద్వారా పరిచయం చేస్తున్నామని, సాంకేతిక నిపుణులందరూ గతంలో పలు చిత్రాలకు చేసిన అనుభవం ఉన్నవారేనని నిర్మాత ఎన్.కమల్ తెలిపారు. కార్యక్రమంలో హీరో రామకృష్ణ చిత్ర విశేషాలను తెలిపారు. కెమెరామెన్ ప్రవీణ్ కె.బంగారి, నందు జన్న, శ్రీ మురళి, చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీమురళి, కెమెరా: ప్రవీణ్ కె.బంగారి, నిర్మాత: అయితం ఎన్.కమల్, రచన, దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్.