దీపికా ప్లీజ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరల్డ్ క్లాస్ ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు బయోగ్రఫీని -దీపికా పదుకొనె చేయనుందా? నిర్మాత సోనూసూద్ ఆలోచనలు ఎంత భారీగా ఉన్నాయో తెలీదుకానీ, దీపిక అయితే కథకు న్యాయం జరుగుతుందన్న భావన వ్యక్తం చేస్తోంది పీవీ సింధు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సింధుకు ఈ ప్రశ్న ఎదురైనపుడు -‘నిజానికి సినిమాకు సంబంధించి నాకేమీ వివరాలు తెలీవు. సోనూసూద్‌ను కలిసిన తరవాతే స్పష్టత వస్తుందేమో’నంటూ సమాధానమిచ్చింది. బయోగ్రఫీలో ఎవరైతే బావుంటారన్న ప్రశ్నకు ‘దీపిక మంచి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. అంతకుమించి గొప్ప నటి. అథ్లెటిక్ ఆహార్యం. ఇవన్నీ పాత్ర స్వరూపానికి దగ్గరగా ఉండేవే. ఈ కారణంగా కొన్ని సంఘటనలకు సంబంధించి భావోద్వేగాలను పలికించటం సులువవుతుందని నా అభిప్రాయం’ అంటూ సమాధానమిచ్చింది. అయితే ‘అంతకుమించి ఎన్నో అంశాలు ప్రాతిపదికగా ఉండొచ్చని, అందువల్ల నిర్మాతల నిర్ణయాన్ని ఏకీభవిస్తూ గౌరవిస్తా’నంటూ చెప్పుకొచ్చింది. జాతీయ చిత్రంగా నిర్మితమయ్యే సింధు బయోపిక్‌లో కోచ్ పుల్లెల గోపీచంద్ పాత్ర అక్షయ్‌కుమార్ పోషించే అవకాశం ఉందన్న కథనాలూ లేకపోలేదు. దీనిపైనా సింధు స్పందిస్తూ ‘సినిమాకు సంబంధించి వివరాలు తెలీదు. కాకపోతే, అక్షయ్‌కుమార్ నాకు ఇష్టమైన నటుడు. గోపీచంద్ పాత్రకు ఆయన సరిగ్గా సరిపోతారనే భావిస్తున్నా’నంటూ చెప్పింది. సింధు సాధిస్తోన్న రికార్డుల నేపథ్యంలో -స్క్రిప్ట్ కైమాక్స్‌లో మార్పులు చోటుచేసుకుంటోన్న విషయం తెలిసిందే. ప్రీప్రొడక్షన్స్ కొలిక్కి వచ్చిన తరువాతే -బయోపిక్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.