క్యూట్ లవ్ స్టోరీ.. రామచక్కని సీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రోకోడైల్ క్రియేషన్స్, లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం -రామచక్కని సీత. శ్రీహర్ష మండా దర్శకుడు. విశాలాలక్షి మండా, జిఎల్ ఫణికాంత్ నిర్మాతలు. ఇంద్ర, సుక్రుతా వేగల్ హీరో హీరోయిన్లు. సినిమా ట్రైలర్ గురువారం బి గోపాల్ చేతులమీదుగా విడుదల చేశారు. గోపాల్ మాట్లాడుతూ -మంచి టైటిల్‌తో వస్తున్న సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. నిర్మాత ఫణీంద్ర మాట్లాడుతూ -దాసరి కిరణ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. కథ రెడీ చేసుకున్నాక ఏంచెయ్యాలో తెలీని పరిస్థితుల్లో విశాలాక్ష్మి అండగా నిలబడి పుషింగ్ ఇచ్చారన్నారు. దర్శకుడు శ్రీహర్ష మాట్లాడుతూ -నాకు సినిమా చాన్స్ కల్పించాలని స్నేహితుడైన ఫణీంద్ర ఈ సినిమా తీశాడు. అవుట్‌పుట్ బాగా వచ్చింది. మిగతా కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్‌లోనే సినిమాను థియేటర్లకు తెస్తున్నాం అన్నాడు. హీరో ఇంద్ర మాట్లాడుతూ -మంచి సినిమాతో మీ ముందుకొస్తున్నాం. దర్శకుడే అన్నీ తానై చేసిన వన్‌మ్యాన్ షో ఇది. మంచి రిజల్ట్ ఉంటుందన్న నమ్మకంతో ఉన్నాం అన్నాడు. హీరోయిన్ మాట్లాడుతూ -కన్నడలో ఏడు సినిమాలు చేశా. తెలుగులో తొలి సినిమా. ఇక్కడా ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. మల్టీ డైమెన్షన్ వాసు మాట్లాడుతూ -టీజర్ విడుదలయ్యాక సినిమాపై అంచనాలు పెరిగాయన్నారు.