అక్టోబర్‌లో అక్షర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందితశే్వత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం -అక్షర. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమానుంచి వచ్చిన టీజర్, టైటిల్‌సాంగ్‌కు మంచి ఆదరణ రావడం తెలిసిందే. విడుదలకు సిద్ధమైన సినిమాకు సంబంధించి నిర్మాతలు సురేష్‌వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ వివరాలందిస్తూ -విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపుతూ, చక్కని పరిష్కారం చూపించే ఇతివృత్తమే అక్షర అన్నారు. నందిత శే్వత పాత్ర ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని, కమర్షియల్ ఎలిమెంట్స్ తగ్గకుండా అద్భుతమైన మెసేజ్‌తో సినిమా రూపొందిందన్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ పూర్తిచేసి అక్టోబర్ ద్వితీయార్థంలో సినిమాకు థియేటర్లకు తెచ్చే ఆలోచన చేస్తున్నాం. అక్షర ప్రతి ఒక్కరినీ అలరిస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు. దర్శకుడు బి చిన్నికృష్ణ మాట్లాడుతూ -అవుట్‌పుట్‌పై సంతృప్తిగా ఉన్నాం. పోస్ట్ ప్రొడక్షన్స్ వేగంగా సాగుతున్నాయి. అక్షరలాంటి కథలు అరుదు. అలాంటి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు అన్నారు. సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్‌ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నగేష్ బెనగల్ సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి సంగీతం సమకూరుస్తున్నారు.