మెగా.. చె(ఇ)లియానా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రియుడినుంచి దూరమైన తరువాత గోవా బ్యూటీ ఇలియానా మళ్లీ సినిమాలపై గట్టిగానే ఫోకస్ పెడుతోంది. సైరా తరువాత చిరు-కొరటాల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్టులో ఇలియానాకు చోటు దక్కొచ్చట. చరణ్ టీం ఆమెను అప్రోచ్ అవ్వడం, ఆమె ఓకే చెప్పడం జరిగిందని టాక్. పాత్రోచిత దేహ సౌందర్యం కోసం ఇలియానా కసరత్తులు మొదలెట్టిందన్న కథనాలూ లేకపోలేదు. 2012లో రవితేజతో దేవుడు చేసిన మనుషులు సినిమా చేసిన ఇలియానా -రొమాంటిక్ లైఫ్ జోష్‌లో సినిమాలకు దూరమైంది. ఆరేళ్ల గ్యాప్ తరువాత 2018లో మళ్లీ రవితేజతోనే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేసినపుడు -బరువైన ఇలియానాను భరించటం ఆడియన్స్‌కి కష్టమైంది. దేహ సౌందర్యంలో భారీ మార్పులు చోటుచేసుకోవడంతో -ఇలియానాను దాదాపుగా మైండ్‌నుంచి డిలీట్ చేసేశారు. దీంతో వెటరన్ హీరోలతో తప్ప, స్టార్ హీరోల సరసన చాన్స్‌లు దక్కే పరిస్థితి కనుమరుగైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ ఎంట్రీ ఇచ్చిన చిరుకీ జోడీ సమస్య లేకపోలేదు. టాప్ హీరోయిన్‌గా కెరీర్ కొనసాగిస్తున్న నయనతార కుర్ర హీరోలతో జోడీ కడుతూనే, పెద్ద ప్రాజెక్టు కనుక సైరాకు ఓకే చెప్పింది. వెంటనే మరో ప్రాజెక్టు చిరుతో చేసేందుకు అనాసక్తి చూపించడంతో -కాజల్, అనుష్కల పేర్లు తెరపైకొచ్చాయి. ఖైదీ నెంబర్ 150లో చిరు కాజల్ రొమాన్స్ -గుర్తు పెట్టుకోతగినంత గొప్ప ఫీల్‌నివ్వలేదు. స్క్రీన్ అప్పియరెన్స్‌లోనూ వేరియేషన్ కనిపించటమే అందుక్కారణం. చిరు-అనుష్కల పెయిర్ సైతం హెవీ వెయిట్ అనిపించే ప్రమాదం ఉండటంతో ఉన్న ఆప్షన్స్‌లో ఇలియానా పేరు తెరపైకి వస్తోంది. పైగా ఆమెకున్న బాలీవుడ్ ఇమేజ్ కూడా ఇక్కడ వర్కౌట్ కావొచ్చని అంటున్నారు. ప్రస్తుతం పాగల్‌పంతీ సినిమా చేస్తున్న ఇలియానా -మళ్లీ చురుక్కుమనిపించే షేప్‌కి బాడీని తేగలిగితే ఆమెకే అవకాశం ఉంటుందనటంలో సందేహం లేదు. చిరు 152వ ప్రాజెక్టునూ కొణిదెల ప్రొడక్షన్స్‌పై నిర్మాత రామ్‌చరణ్ నిర్మించనున్నాడు. సైరా విడుదల తరువాత -కొరటాల ప్రాజెక్టులో హీరోయిన్ ఎవరన్న ఈక్వేషన్స్ ఓ క్లారిటీకి రావొచ్చు.