మళ్లీ.. అదే మ్యాజిక్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో -అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌తోనే సినిమాపై కొత్త చర్చకు తెరలేపాడు. పోష్ ఏరియా.. లగ్జరీ కారు బ్యాక్‌డ్రాప్.. కాస్ట్లీ సూట్‌లో చీప్ స్టూల్‌మీద మాస్ స్టయిల్లో కూర్చున్న బన్నీ. అతని నోట్లో బీడీ. మర్యాదగా వొంగి ముట్టిస్తున్న సెక్యూరిటీ గార్డ్. ఇదీ ఫస్ట్‌లుక్. దీన్ని అనలైజ్ చేసుకుంటే -దర్శకుడు త్రివిక్రమ్ మళ్లీ ఏదో మ్యాజిక్ చేయబోతోన్న విషయాన్ని అంచనా వేయొచ్చు. బన్నీ -త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇంతకుముందొచ్చిన రెండు చిత్రాల్లోని ‘ఫైనాన్షియల్ స్ట్రగుల్, ఎమోషన్’ని -హ్యాట్రిక్ ప్రాజెక్టులోనూ రిపీట్ చేస్తారా? అన్న చర్చ మొదలైంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మొదట వచ్చిన సినిమా జులాయి. బెట్టింగ్‌తో డబ్బు సులువుగా సంపాదిద్దామన్న ఆలోచనలున్న అత్యంత తెలివైన కుర్రాడు.. తెలీకుండా ఓ ఉచ్చులో ఇరుక్కుని.. తరువాత బ్యాంకు రోబరీ ముఠా కథను ఎలా ముగించాడన్నది స్టోరీ. ఒక్క ముక్కలో చెప్పుకుంటే డబ్బు చుట్టూ తిరిగే కథ. రెండో సినిమా -సన్నాఫ్ సత్యమూర్తి. వందమందిలో ఒక్కడు కూడా వాళ్ల నాన్నగురించి చెడ్డగా ఆలోచించకూడదన్న ఆలోచనతో -కోట్ల ఆస్తిని వదిలేసుకున్న కుర్రాడి కథ. సినిమా ఎక్కడెక్కడో తిరిగినా -మూలం మాత్రం డబ్బు. రెండు హిట్లు తరువాత మళ్లీ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్టే -అల.. వైకుంఠపురములో. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లోని సెన్స్.. బన్నీ ఫన్నీ స్టయిల్ చూస్తుంటే.. ‘డబ్బు- దాని ఇంపాక్ట్’ ఎలిమెంట్‌తోనే కొత్త కథ చెప్పనున్నారా? అనిపిస్తోంది. టైటిల్‌ని బట్టి పోతన భాగవతంలోని ‘గజేంద్రమోక్షం’ సారాన్ని సోషల్ కంటెంట్‌గా చెప్పే అవకాశముందంటూ కథనాలు వస్తున్నాయి. ఏదేమైనా.. కొంత గ్యాప్ తరువాత బన్నీ చేస్తున్న ప్రాజెక్టు కనుక -్ఫస్ట్‌లుక్‌నుంచే ఆసక్తి పెంచేశారు బన్నీ-త్రివిక్రమ్‌లు. త్రివిక్రమ్ పెన్.. బన్నీ పెర్ఫార్మెన్స్.. వీళ్లిద్దరి కాంబోలో వచ్చే సినిమా టేస్ట్ ఆడియన్స్‌కి కొత్త కాదు కనుక -ఈ ప్రాజెక్టుతో బన్నీ ఫ్యాన్స్ ఆకలి తీరుస్తాడన్న అంచనాలు లేకపోలేదు.