ధకీ.. ఇస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రజిత్, త్రిషాలాసా జంటగా సుంకర సత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం -్ధకీ. ఎనుగంటి దర్వకత్వం వహించిన సినిమా టీజర్, బ్యానర్ లోగోను దర్శకుడు వివి వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వినాయక్ మాట్లాడుతూ -సుంకర బ్రదర్స్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సోదరుడికి మంచి లైఫ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో బ్యానర్ స్టార్ట్‌చేసి సినిమాకు సిద్ధపడటం గొప్ప విషయం. ధకీ మంచి విజయం సాధించి బ్యానర్‌కు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ఫైట్‌మాస్టర్ రామ్ సుంకర మాట్లాడుతూ -వినాయక్ చేతుల మీదుగా బ్యానర్ లాంచ్ కావడం హ్యాపీగా ఉంది. ఓ సదుద్దేశంతో బ్యానర్ లాంచ్ చేసి, త్వరలోనే ఈ బ్యానర్‌పై తమ్ముడిని హీరోగా లాంచ్ చేయబోతున్నాం. ఈ సినిమా ఫైట్ మాస్టర్స్ రామ్ -లక్ష్మణ్ చాలా సపోర్ట్ చేశారు. బ్యానర్‌కు అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు ఎనుగంటి మాట్లాడుతూ -ఈ సినిమాతో చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేశా. అంతా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అవకాశం ఇచ్చిన సుంకర బ్రదర్స్‌కు కృతజ్ఞతలు అన్నాడు. హీరో రజిత్ మాట్లాడుతూ -సుంకర బ్రదర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మించారు. అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్‌ని తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుంది అన్నాడు.