కార్తికేయ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సక్సెస్‌పరంగా ఆర్‌ఎక్స్ 100 దగ్గరే ఆగిపోయిన హీరో కార్తికేయ -కెరీర్‌పరంగా మరో మైలురాయి అధిగమించేందుకు కొత్త ప్రయత్నం మొదలెట్టాడు. ఆర్‌ఎక్స్ తరువాత చకచకా అవకాశాలు అందుకుని చేసిన సినిమాలు -కెరీర్‌ను ముందుకు కదల్చలేకపోయాయి. ఒక్కసారిగా వచ్చిన ఫ్యాన్‌మెయిల్ సైతం క్రమంగా మాయమవుతుండటంతో -కార్తికేయ కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హీరోగా తనను నిలబెట్టిన ఆర్‌ఎక్స్ 100 చిత్ర నిర్మాతతోనే కొత్త ప్రాజెక్టు చేస్తున్నాడు. శేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుత్నున చిత్రానికి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయలేదు. టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని 9న విడదల చేయనున్నట్టు చిత్రబృందం చెబుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చనున్న ప్రాజెక్టు పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. త్వరలో విడుదల కాబోతోన్న నానీస్ గ్యాంగ్‌లీడర్‌లో కార్తికేయ ప్రత్యేక ప్రతినాయక పాత్రలో కనిపించనుండటం తెలిసిందే.