విజయ్‌తో శిరీష్!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బిచ్చగాడు’ హీరోగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయాడు విజయ్ ఆంటోనీ. ఏ సినిమాతో వచ్చినా ఏదోక వైవిధ్యం ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించాడు. అదే విజయ్ ఆంటోనీ హీరోగా మరో వైవిధ్యమైన సినిమా రూపుదిద్దుకుంటోంది. తమిళంలో సినిమా రూపుదిద్దుకుంటున్నా, తెలుగు హీరో కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కనుక -ఇక్కడి ఆడియన్స్‌ను టార్గెట్ చేసినట్టే కనిపిస్తోంది. తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ తెరకెక్కిస్తోన్న ఆ సినిమా -మళైపిడిక్కాద మనిదన్. వర్షంపడని వ్యక్తి అన్నది టైటిల్ మీనింగ్. టైటిల్‌లోనే వెరైటీ కనిపిస్తుంటే, కథా కథనాలతో మరింత ఉత్కంఠభరితంగా ఉంటాయని చెబుతోంది చిత్రబృందం. సినిమాలో విజయ్ ఆంటోనీతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న తెలుగు హీరో -అల్లు శిరీష్ అట. స్వభావంలో వైవిధ్యం కనిపిస్తోన్న ఆ పాత్ర కెరీర్‌కు పూర్తిగా ప్లస్ అవుతుందన్న ఆలోచనతోనే శిరీష్ అంగీకరించాడని అంటున్నారు. తమిళంతోపాటు తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ వస్తోన్న విజయ్ ఆంటోనీ.. కచ్చితంగా ఈసారి బిచ్చగాడుస్థాయి సినిమానే ఇస్తాడన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు చిత్రబృందం నుంచి త్వరలోనే వెల్లడికావొచ్చు.