రాగల 24 గంటల్లో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యదేవ్, ఇషా రెబ్బ హీరో హీరోయిన్లుగా ప్రముఖ కథానాయకుడు శ్రీరామ్, పైసా వసూల్ ఫేం ముస్కాన్ సేథ్, గణేశ్ వెంకట్రామన్ కీలక పాత్రల్ల నటించిన చిత్రం రాగల 24 గంటల్లో. ఈ చిత్రానికి శ్రీనివాస్ కానూరి నిర్మాత. ఢమరుకం శ్రీనివాస్‌రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ విభిన్నంగా జరిగింది. రెండు పోస్టర్లను విడుదలచేసింది చిత్ర యూనిట్. మొదటి పోస్టర్‌ను సి. కల్యాణ్ విడుదల చేశారు. రెండో పోస్టర్‌ను శ్రీనివాస్‌రెడ్డి బావ దంతులూరి కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా సి.కల్యాణ్ మాట్లాడుతూ- వెరైటీ టైటిల్స్‌తో ఆసక్తికరమైన చిత్రాలను తీసి సంచలన విజయాలను సాధించే దర్శకుడు శ్రీనివాస్‌రెడ్డి గతంలో అనేక కామెడీ చిత్రాలను తీసి విజయం సాధించారు. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారని నాకు తెలుసు అన్నారు. దంతులూరి కృష్ణ మాట్లాడుతూ- మా బావ ఎంత మంచి చిత్రాలు తీశారో నాతోపాటు ప్రేక్షకులందరికీ తెలుసు. ఈ సినిమా రషెస్ చూశాను. ఇషా, శ్రీరామ్‌ల నటన సినిమా హైలెట్‌గా ఉంటుందన్నారు.