పోస్ట్ ప్రొడక్షన్‌లో చల్ చల్ గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన తారాగణంగా ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహనప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య రూపొందిస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మోహనప్రసాద్ మాట్లాడుతూ, ఎమోషనల్ కామెడీ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కథానాయకుడు శైలేష్ కార్ రేసర్‌గా సరికొత్తగా కనిపిస్తారని, వెంగి సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలు ఇటీవల విడుదలై మంచి ఆదరణను పొందుతున్నాయని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో ఈ చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని, నవ్యత అందరికీ నచ్చుతుందని, వెంగీ సంగీతం సినిమాకు ప్లస్‌గా మారనుందని హీరో శైలేష్ తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్న ఈ చిత్రాన్ని మే నెలాఖరుకు గానీ, జూన్ ప్రథమార్థంలో గానీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత ఎం.రాఘవయ్య అన్నారు. నాగబాబు, బెనర్జీ, అశోక్‌కుమార్, చిట్టిబాబు, ముఖ్తార్‌ఖాన్, ప్రవీణ్‌కుమార్, సుడిగాలి సుధీర్, అంబటి శ్రీని, జోగినాయుడు, హర్ష, కృష్ణంరాజు, తిరుపతి ప్రకాష్, దువ్వాసి మోహన్, జూ.రేలంగి, మీనా, శిల్ప తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వి.శ్యామ్‌ప్రసాద్, సంగీతం: వెంగి, ఎడిటింగ్: శంకర్, నిర్మాత: ఎం.రాఘవయ్య, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహనప్రసాద్.

చిత్రం శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్