మళ్లీ ఇస్మార్ట్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేస్తే మళ్లీ మాస్ లైన్‌తోనే ప్రాజెక్టు చేయాలన్న థాట్‌కు ఫిక్సయ్యాడట రామ్. వరుస ఫ్లాపుల కారణంగా యంగ్ హీరోల రేసులో వెనకబడిన రామ్ -ఇస్మార్ట్ శంకర్‌తో బాక్సాఫీస్ వద్ద మోత మోగించాడు. పూరి -రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ -ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రామ్ మాస్ ప్రజెన్స్‌కి ఆడియన్స్ పిచ్చిగా కనెక్టవ్వడంతో -తదుపరి ప్రాజెక్టు సైతం అదే లైన్‌లో చేయాలన్న నిర్ణయానికి వచ్చేశాడని అంటున్నారు. నిజానికి ఇస్మార్ట్ తరువాత -డైరెక్టర్ కిషోర్ తిరుమలతో రామ్ ఓ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. ఇస్మార్ట్‌కు ముందు రామ్‌చేసిన ఒకటిరెండు ప్రేమ కథలు ఆడియన్స్‌కి ఓ మోస్తరు ఫీల్‌నివ్వడంతో, రామ్ కెరీర్ సేఫ్ అయ్యింది. ముఖ్యంగా కిషోర్ తిరుమల -రామ్ కాంబినేషన్‌లో వచ్చిన నేను- శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలు ఓకే అనిపించుకున్నా, హీరోగా మాత్రం రామ్‌కి మైలేజ్ తేలేకపోయాయి. మళ్లీ కిషోర్‌తో చేయాల్సిన ప్రాజెక్టు పట్టాలెక్కడానికి కొంత టైంపట్టే అవకాశం ఉండటంతో, ఈలోగా మాస్ సినిమా చేయడానికి రామ్ రెడీ అయినట్టు తెలుస్తోంది. ఇందుకోసం వీవీ వినాయక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. వినాయక్ సైతం హీరోగా సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్టు కూడా సెట్స్‌పైకి వెళ్లడానికి టైంపట్టేలానే ఉంది. దీంతో ఇద్దరూ గ్యాప్ టైంలో ఓ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అంగీకారానికి వచ్చారని అంటున్నారు. మాస్ మసాలా అంశాలు పుష్కలంగావున్న వినాయక్ చెప్పిన లైన్ రామ్‌కు పిచ్చిగా నచ్చేయడంతో -ప్రాజెక్టును వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారన్నది ఇండస్ట్రీ టాక్. పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి.