స్ఫూర్తిదాయక పహిల్వాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెజ్లర్‌గా కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ పోషిస్తోన్న యాక్షన్ డ్రామా -పహిల్వాన్. దర్శకుడు ఎస్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం ట్రైలర్ ఇటీవలే తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ సాధించింది. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి తెలుగులో సెప్టెంబర్ 12న సినిమా విడుదల చేస్తున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పహిల్వాన్ ఫస్ట్ టికెట్‌ను పీవీ సింధు, బోయపాటి శీను కొనుగోలు చేశారు. వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ పీవీ సింధు మాట్లాడుతూ -హార్డ్‌వర్క్ ఎప్పటికైనా విజయానికి దగ్గర చేస్తుందని చాటిచెప్పే పహిల్వాన్ లాంటి చిత్రాలు స్ఫూర్తిదాయకం. చిత్రం యూనిట్‌కు అభినందనలు అన్నారు. దర్శకుడు బోయపాటి మాట్లాడుతూ -తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల మధ్య మంచి అనుబంధముంది. తెలుగు సినిమాలను అక్కడ బాగా ఆదరిస్తున్నారు. కన్నడ సినిమాలకూ తెలుగు పరిశ్రమలో మంచి ఆదరణ ఉంటుందన్న విషయాన్ని కేజీఎఫ్ నిరూపించింది. ఇప్పుడు పహిల్వాన్ సైతం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తన్నా. ఇక కిచ్చా సుదీప్ పాన్ ఇండియా స్టార్. భాషాతీతమైన నటుడిగా పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం. నిర్మాత సాయి కొర్రపాటి మంచి మూవీ లవర్. భాషాభేదం లేకుండా సినిమాను సినిమాగా చూసే నిర్మాత కనుకే -పహిల్వాన్ తెలుగు ఆడియన్స్‌కు చూపించేందుకు తాపత్రయపడుతున్న విషయాన్ని గమనించాలి. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా అన్నారు. హీరో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ -ఈగ చిత్రంలో నాకు మంచి లైఫ్ నిచ్చిన దర్శకుడు రాజవౌళి, తెలుగు ప్రేక్షకులను ఎప్పటికీ మర్చిపోలేను. ఎస్ కృష్ణ దర్శక నిర్మాతగా కష్టపడి చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగులో సినిమాను అందిస్తున్న సాయి కొర్రపాటికి కృతజ్ఞతలు అన్నారు. దర్శకుడు ఎస్ కృష్ణ మాట్లాడుతూ -పహిల్వాన్ షూటింగ్ ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే జరిగింది. సినిమా నచ్చడంతో తెలుగులో భారీగా విడుదల చేయడానికి సిద్ధమైన నిర్మాత సాయికి ధన్యవాదాలు అన్నారు. కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్ర్తీ, హనుమాన్ చౌదరి, ఆకాంక్ష సింగ్, కబీర్ దుహన్ సింగ్, చాముండేశ్వరినాథ్ తదితరులు పాల్గొన్నారు.