నానీస్ స్టామినా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ టైంలో పెద్ద ప్రొడక్షన్ హౌస్‌గా ఆవిష్కృతమైంది మైత్రీ మూవీ మేకర్స్. తెలుగులో భారీ ప్రాజెక్టులకు ఓ కేరాఫ్ అడ్రెస్‌గానూ మారింది మైత్రి. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం.. ఇలాంటి బ్లాక్‌బస్టర్లను తన ఖాతాలో వేసుకుని -బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ స్థాయికి ఎదిగిన సంస్థల్లో మైత్రీని ముందు వరుసలో ఉంచొచ్చు. అయితే కాలం కలిసి రాకపోతే -వ్యాపారం వెనక్కిపోతుందన్న మరో కోణానికీ మైత్రి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ అన్న వాతావరణం కనిపిస్తోంది. సుకుమార్ -రామ్‌చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రంగస్థలంతో ఓ ప్రత్యేక స్టేటస్‌కు వెళ్లిపోయిన మైత్రికి -అంతేవేగంగా సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీలాంటి డిజాస్టర్లూ ఎదురై బిజినెస్ గ్రాఫ్‌ని కిందకు దించేశాయి. బ్లాక్‌బస్టర్లు తెచ్చిన లాభాలను డిజాస్టర్లు పట్టుకుపోవడంతో -మైత్రి వ్యాపార సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న కథనాలు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్నాయి. ఆమధ్య సాయిధరమ్ తేజ్‌తో చేసిన చిత్రలహరి చిత్రం పెట్టుబడులను వెనక్కి తేగలిగినా -డియర్ కామ్రేడ్ డివైడ్ టాక్‌తో మైత్రికి మళ్లీ కష్టాలే ఎదురయ్యాయి. కోటి కష్టాలనైనా ఒక్క సినిమా తుడిచేస్తుందన్న ఆశావహ దృక్ఫథంలో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వస్తోన్న సినిమా -నానీస్ గ్యాంగ్‌లీడర్. ఈ ఒక్క సినిమా కనుక అనుకున్నంతగా వర్కౌటైతే -మైత్రి ఫ్యూచర్ ప్రాజెక్టులకు మళ్లీ ఊపు రావడం ఖాయం. సినిమాకు క్వాలిటీ ముఖ్యం అన్న రూల్‌ని సిన్సియర్‌గా ఇంప్లిమెంట్ చేస్తే మైత్రీ సంస్థ -గ్యాంగ్‌లీడర్‌నూ భారీ బడ్జెట్‌తోనే సిద్ధం చేసింది. అందుకు తగ్గట్టే బిజినెస్ కూడా పూర్తి కావడంతో -నిర్మాతలు సేఫ్‌జోన్‌లో ఉన్నట్టే. అయితే సినిమా తెచ్చే రిటర్న్స్‌మీదే అంటే బయర్లు సేఫైతే.. భవిష్యత్ బావుంటుందన్న వాతావరణమే కనిపిస్తోంది. ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద ధైర్యంగా ఇనె్వస్ట్‌మెంట్లు పెట్టుకుంటూ పోతున్న మైత్రికి -గ్యాంగ్‌లీడర్ విజయం అవసరమే కాదు, అనివార్యం కూడా. సెప్టెంబర్ 13న థియేటర్లకు వస్తోన్న నాని -ఆడియన్స్‌కి అందించే ఎంటర్‌టైన్‌మెంట్ మీద ఓ నిర్మాణ సంస్థ భవిష్యత్ ఆధారపడి ఉందంటే నమ్మితీరాలి. టీజర్, ట్రైలర్‌తో సినిమాపై ఆసక్తి పెంచేసిన నాని-విక్రమ్‌లు ఏమేరక నిర్మాతను నిలబెడతారో వెండితెరపైనే చూడాలి.