పూజకు.. వేళాయెరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిమాండ్‌కు తగిన టెంపర్ సప్లయి చేస్తోందట -పూజా హెగ్దె. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వినిపిస్తోన్న మాటిది. చాలాకాలంపాటు సరైన అవకాశాలు రాక అల్లాడిన పూజాహెగ్దెకు కాలం కలిసి రావడంతో ఒక్కసారిగా స్టార్‌డమ్ వచ్చేసింది. లెక్కకుమించి అవకాశాలు.. చేతినిండా సినిమాలు.. కోట్లలో రెమ్యునరేషన్.. ఓహ్ -తిరుగులేని డిమాండ్ సాధించుకున్న పూజ -ఆ టెంపర్‌ను తన ప్రవర్తనలోనే చూపిస్తోందంటూ దర్శక నిర్మాతలు కనె్నర్ర చేస్తున్నారట. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలన్న విషయాన్ని మర్చిపోయి -దర్శక నిర్మాతల సహనానికి డస్కీ బ్యూటీ పరీక్ష పెడుతుందన్న కామెంట్లు ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం పూజాహెగ్దె -మరోసారి బన్నీకి జోడీగా సినిమా చేస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తోన్న అల.. వైకుంఠపురంలో ఆమె హీరోయిన్. అకస్మాత్తుగా వచ్చిన స్టార్‌డమ్‌ని నెత్తిన మోస్తున్న పూజ -పని విషయంలో నిర్లక్ష్యంతో ప్రాజెక్టు ఆలస్యానికి కారణమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్లకు తేవాల్సి ఉండటంతో -శరవేగంగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి పక్కాగా వేసుకున్న త్రివిక్రమ్ ప్రణాళికలు -పూజ కారణంగా తలకిందులవుతున్నాయన్నది టీంనుంచి వినిపిస్తోన్న మాట. డిమాండ్‌కు తగిన టెంపర్‌ను సప్లయి చేసిన చాలామంది స్టార్లే కనుమరుగైపోయారు. అలాంటి పరిస్థితి రాకముందే -జాగ్రత్త పడటం పూజా హెగ్దె కెరీర్‌కు ఎంతైనా అవసరం.