టైటిల్ నిలబెట్టేలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా చేస్తోన్న సైరానుంచి టైటిల్ సాంగ్ బయటికొచ్చేందుకు రెడీ అవుతోందట. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చారిత్రక చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ప్రభాస్ సినిమా సాహో కారణంగా -సైరా ప్రమోషన్స్‌ను ఇప్పటి వరకూ నెమ్మదిగా లాగించారు. సాహో భ్రమలు విడిపోవడంతో -మరో భారీ బడ్జెట్ చిత్రంగా సైరా ఒక్కటే ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో భారీగా ప్రమోషన్స్ నిర్వహించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఈ వేడుకకు కాస్త ముందే -సైరా టైటిల్ సాంగ్‌ను బయటకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. దేశభక్తి ప్రభోదాత్మక గీతంగా సిరివెనె్నల సీతారామ శాస్ర్తీ రాసిన ఐదు నిమిషాల అతి పెద్ద పాట -సినిమాకు మంచి అస్సెట్ అవుతుందన్న నమ్మకంతో చిత్రబృందం కనిపిస్తోంది. సినిమా విడుదలయ్యేలోగా పాటను జనాల్లోకి బలంగా తీసుకెళ్తే -్ఫలితం ఉంటుందన్న ఆలోచన కనిపిస్తోంది. మల్టీ లాంగ్వేజెస్‌లో వస్తోన్న సైరా చిత్రానికి భారీ ప్రమోషన్స్ నిర్వహిస్తూనే.. కన్నడ, తమిళ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేసేందుకు బెంగళూరులో భారీ వేడుక, చెన్నైలో మెగాస్టార్‌తో ప్రెస్‌మీట్ నిర్వహించే యోచనలో నిర్మాతలున్నట్టు తెలుస్తోంది.