సై సై..ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విషయంలోనైనా -బాలీవుడ్ క్వీన్ కంగనా ఓ స్పెషల్. విజయాల్లోనైనా.. వివాదాల్లోనైనా ఆమె రూటే సెపరేటు. ఆమె యాక్షన్‌కు ప్రతి రియాక్షన్ వివాదామే అయినా -పట్టించుకునే రకమైతే కాదు. ఆ తత్వమే ఆమెను విజయాలవైపు పరిగెత్తిస్తోందనే అభిమానులూ లేకపోలేదు. కంగన ప్రస్తుతం తమిళనాడు దివగంత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌కు ప్రిపేరవుతోంది. వర్కింగ్ టైటిల్ ‘తలైవి’గా తెరకెక్కుతోన్న సినిమా కోసం -పాత్రోచిత ఎఫర్ట్స్ పెట్టే పనిలో ఉందట. ఆహార్యం నుంచి అభినయం వరకూ తనను తాను మార్చుకునే కసరత్తులో కంగనా ఉందని అంటున్నారు. తలైవి పాత్ర కోసం కంగన తమిళం సైతం నేర్చుకుంటున్నట్టు ఇటీవలే చిత్ర నిర్మాత విష్ణువర్థన్ వెల్లడిస్తే -జయలలితకు ఎంతో ఇష్టమైన భరతనాట్యాన్ని సైతం అభ్యసిస్తోందన్న మాట వినిపిస్తోంది. బక్చపల్చని శరీరంతోవుండే కంగన -పాత్రకు నిండుదనం తేవడానికి బరువు పెరిగే కసరత్తులపైనా దృష్టి పెట్టిందని సమాచారం. పాత్రలో ఒదిగిపోవడానికి దేనికైనా రెడీ అంటున్న కంగన తత్వాన్ని చూసి -కోలీవుడ్ జనం ముచ్చటపడుతున్నారు. ‘స్టార్‌డమ్’ ఊరికే రాదన్న విషయం కంగన తన నిబద్ధతతో రుజువు చేస్తోందని అభిమానులు అంటున్నారు..