టీజర్‌కొచ్చిన చాణక్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, మెహరీన్ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ స్పై థ్రిల్లర్ -చాణక్య. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన సినిమా. తాజాగా సినిమా షూటింగ్ పూరె్తైనట్టు చిత్రబృందం ప్రకటించింది. పోస్ట్ ప్రొడక్షన్స్ వేగంగా జరుగుతున్నాయని, టీజర్‌ను సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. చాణక్యగా గోపీచంద్ లుక్కుకు మంచి రెస్పాన్స్ రావడం తెలిసిందే. చాణక్య చిత్రాన్ని దసరాకు విడుదల చేసే ప్రయత్నాల్లో నిమగ్నమైవుంది చిత్రబృందం. విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తున్న చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ సమకూర్చారు. అయితే దసరా సీజన్‌ను టార్గెట్ చేస్తూ భారీ బడ్జెట్ సినిమా సైరా థియేటర్లకు వస్తున్నప్పటికీ, అదే సీజన్‌లో చాణక్యనూ తేవడానికి కారణం మంచి అవుట్‌పుట్‌పై చిత్రబృందానికి ఉన్న నమ్మకమే అంటున్నారు సినీ పరిశీలకులు.