మీ సేవలు మరువం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ తెలుగు సినీ రథసారధుల రజతోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై -ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సేవలను కొనియాడారు. కృష్ణంరాజు, చిరంజీవి, రాజశేఖర్, మహేష్‌బాబు, కృష్ణ, కోట శ్రీనివాస్, జయప్రద, సుమలత, జయసుధ, రాశిఖన్నా, రెజీనా, పూజాహెగ్డే, ఎమ్‌ఎల్ కుమార్‌చౌదరి, గిరిబాబు, అశ్వినీదత్, రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ -సినీ మేనేజర్లు చేస్తోన్న ఫంక్షన్ సక్సెస్ దిశగా ముందుకెళ్తోంది. ఎన్నో మంచి సినిమాలు తీయడానికి సహకరించిన మేనేజర్లకు కృతజ్ఞతలు అన్నారు. గిరిబాబు మాట్లాడుతూ ప్రొడక్షన్ మేనేజర్లు సేవలు అమూల్యం. కొబ్బరికాయతో మొదలెట్టి గుమ్మడికాయతో ముగించే వరకూ వాళ్లే హెల్ప్‌ఫుల్. అలాంటి మేనేజర్లు పది కాలాలు చల్లగా ఉండాలన్నారు. కృష్ణంరాజు మాట్లాడుతూ -ప్రొడక్షన్ మేనేజర్లు ఇంత మంచి ఫంక్షన్ చేస్తారని ఊహించలేదు. వాళ్లు తలుచుకుంటే సినిమా టైమ్‌లో పూర్తి చెయ్యగలరు. భవిష్యత్తులో వీళ్ల సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. మహేష్‌బాబు మాట్లాడుతూ -్ఫంక్షన్‌లో చిరంజీవిని కలవడం కొత్త ఎనర్జీ. మేనేజర్ల ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని సక్సెస్‌ఫుల్ ఈవెంట్స్ చెయ్యాలని కోరుకుంటున్నా అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ -తాను ఇప్పటికి 32 సినిమాలు చేశానని, అందుకే ఆ యూనియన్‌కు 32 లక్షలు విరాళం ఇస్తున్నానన్నారు. చిరంజీవి మాట్లాడుతూ -మేనేజర్ల సిల్వర్‌జూబ్లీ వైభవంగా జరగడం హ్యాపీ. సినిమా మొదటినుంచి చివరి వరకూ శ్రమించేది మీరే. సినిమా అద్భుత సౌధమనుకుంటే, మేనేజర్లు పునాదిరాళ్లు అన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ -మహోత్సవాన్ని గ్రాండ్‌గా చేసిన మేనేజర్ల యూనియన్‌కు అభినందనలు. ఇండస్ట్రీలోని ప్రముఖులు ఫంక్షన్‌కు రావడం హర్షించదగ్గ విషయం. భవిష్యత్తులోనూ చిత్ర పరిశ్రమకు సహాయపడతా అని హామీ ఇచ్చారు.